కాకినాడ కలెక్టరేట్: జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధుల్లో చేరి రెండేళ్లు పూర్తయినందున వీరి ప్రొబేషన్ డిక్లేర్‌కు చర్యలు తీసుకుంటున్నామని సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి తెలిపారు.
బుధవారం కలెక్టరేట్‌లో ఆమె డీఆర్వో సత్తిబాబుతో కలిసి సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు పూర్తి చేసిన శిక్షణ వివరాలను సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని, రెండేళ్ల సర్వీసు క్రమం తప్పకుండా ఉండాలని సూచించారు. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు లేనివారిని మాత్రమే ప్రొబేషన్ డిక్లేర్‌కు ప్రతిపాదించాలన్నారు. జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో కేవీఎస్ గౌరీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment