వంజంగి హిల్స్‌కు పర్యాటకుల తాకిడి
పాడేరు : ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి హిల్స్‌కు ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కొంతమంది ప్రతికూల వాతావరణాన్ని సైతం పట్టించుకోకుండా శనివారం రాత్రి నుంచే వంజంగి హిల్స్‌లోని పలు కొండల వద్ద గుడారాలు వేసుకుని క్యాంప్ ఫైర్లతో సందడి చేశారు.
రాత్రంతా అక్కడే ఉన్న పర్యాటకులు తెల్లవారు జామున మూడు గంటల సమయంలో అత్యంత ఎత్తులో ఉన్న బోనంగమ్మ శిఖరానికి కాలినడకన చేరుకున్నారు. సూర్యోదయం సమయంలో అక్కడి ప్రకృతి అందాలను వీక్షించి పరవశించి పోయారు. పాడేరు, ఇతర ప్రాంతాల్లో బస చేసిన పర్యాటకులు కూడా ఆదివారం ఉదయాన్నే వంజంగి హిల్స్‌కు చేరు కున్నారు. ఉదయం 10 గంటల వరకు పొగమంచు, కొండల దిగువున చుట్టేసిన మేఘాలు పర్యాటకులను ఎంతో ఆకట్టుకున్నాయి. పర్యాటకుల రద్దీతో గిరిజనులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలకు వ్యాపారం పెరగడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. మరోపక్క వంజంగి హిల్స్ రోడ్డులో వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పాడేరు పట్టణంలోని మోదకొండమ్మతల్లి ఆలయం, ఘాట్‌లోని మోదకొండమ్మ తల్లి అమ్మవారి పాదాలు గుడి, కాఫీ తోటలు, మోదాపల్లి, డల్లాపల్లి ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు.
0 Comments:
Post a Comment