ఉద్యోగ సంఘాలను ప్రక్షాళన చేయాలి
పదో రత్నమైన ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు
మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా రాయితీలు వదుకోవాలి
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు
విశాఖపట్నం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగుల సంఘా లను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు అభిప్రాయపడ్డారు.
ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన విశాఖ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాటా ్లడుతూ, సంఘాలకు ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహించాలని, దీని వల్ల ప్రజాస్వామ్య విధానం కొనసాగడమే కాకుండా సమర్థులకు నాయకత్వం లభిస్తుందని అన్నారు. సంఘం నేతలుగా పోటీ చేయాంటే రిటైర్‌మెంట్‌కు ఐదేళ్ల సర్వీస్ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపట్టిన నవరత్నాల పథకాలను సమర్థంగా అమలుచేసే పదో రత్నమైన ఉద్యోగులను పాలకులు పట్టించు కోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యో గులు కొన్ని రాయితీలు వదులుకోవాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఇటువంటి నిబంధ నలు ఉద్యోగులకే కాకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులకు కూడా వర్తింపజేయాలని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకు త్వరలో చేపట్ట నున్న ఆందోళనకు జిల్లా నుంచి 1,000 మంది 1,500 మంది వరకు విజయవాడకు వస్తే సభ విజయవంతం అవుతుందని ఆస్కారావు అన్నారు.
జిల్లా సంఘానికి త్వరలో ఎన్నికలు
విశాఖ జిల్లా సంఘం ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో ప్రతిపాదించారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి రాజ్‌కుమార్, సహాయ ఎన్నికల అధికారిగా రాష్ట్ట్ర కోశాధికారి బి.నాగసాయిని నియమంచారు. ఎన్నికలు జరిగే వరకు సంఘం జిల్లా అధ్యక్షుడిగా న్యాయశాఖకు చెందిన ఎండీ ఫజుద్దీన్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రాజ్‌కుమార్, నాగసాయి, ఐ.రఘుబాబు, డి.శ్రీకాంతరాజు, జి.కిశోర్‌కుమార్, బి. సుగుణ, కార్యదర్శి ఎస్‌వీ రమణ, నేతలు వై.వినయ్‌కుమార్, ఎం.వై.నరసింహ, మంజులత తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment