ఏపీలో ప్రతి ఉద్యోగి కూడా అసంతృప్తితో ఉన్నాడు: ఆస్కారరావు
విశాఖపట్నం: విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కారరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి కూడా అసంతృప్తితో ఉన్నాడన్నారు.
గత ప్రభుత్వం ఉద్యోగులకు నష్టం కలిగించే, పనులు చేపట్టిందని.. అవన్నీ అమలు చేస్తామని జగన్ చెప్పారన్నారు. ఇప్పుడు, పీఆర్సీ, డీఏ కాదు కదా కనీసం, దహన సంస్కారాల ఖర్చులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పదవీ విరమణ చేసిన వారు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. మూడు సంవత్సరాల నుండి సగటు ఉద్యోగి, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే చులకనగా చూస్తున్నారని.. ఒక వర్గంగా కూడ గుర్తించడం లేదని తెలిపారు. సమస్యలపైన ఎవరిని కలిసినా ప్రయోజనం ఉండటం లేదన్నారు. ప్రభుత్వ౦ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి నుండి పోరాటానికి సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల పట్ల గుండాలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వేధింపులు ఆపకపోతే మొట్టమొదటి పోరాటం తమ మీదే చేపడతామని.. తాము ఇకపై రోడ్లపైకి వస్తామని అన్నారు. డిపార్ట్మెంట్ టెస్ట్ నిర్వహించకుండా గ్రామ వార్డు సచివాలయాల్లో రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. బొప్పరాజు, బండి శ్రీనివాస్ జేఏసీలుగా గతంలో ఎందుకు విడిపోయారు ఇప్పుడు ఎందుకు కలిశారో చెప్పాలని ఆస్కారరావు డిమాండ్ చేశారు.
0 Comments:
Post a Comment