ఈనాడు, అమరావతి: ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగులకు చెందిన ఆర్జిత సెలవులు (ఈఎల్స్) ఎన్‌క్యాష్‌మెంట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ యాజమాన్యం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించి ఏడాదికి 15 రోజులు చొప్పున, రెండేళ్లలో 30 రోజులకు ఎన్‌క్యాష్‌మెంట్‌కు వీలు కల్పించారు. దీని కోసం ఉద్యోగులు తమ సెలవులను ఈ నెల 11లోపు సరెండర్ చేయాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలపై స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. అలాగే 2017-18, 2018-19, 2019-20 సంవత్సరాలకు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను ఆర్టీసీ నిధులతో చెల్లించాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిలానిబాషా, సుందరయ్య ఓ ప్రకటనలో కోరారు.
0 Comments:
Post a Comment