Beauty with banana peel: అరటితొక్కతో ఇన్ని చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు?
సాధారణంగా అరటిపండు (Banana) ను ఆరోగ్యం కోసం తింటాం. అరటిపండు తొక్కను తిన్నాక.. తొక్కను పారేస్తాం. కానీ, మనం విసిరేసే తొక్కను (Banana peel) చర్మానికి కూడా సంరక్షణను ఇస్తుంది.
అవును.. ఇది మీరు నమ్మరు, చాలా మంది మహిళలు, యువతులు ఇటీవల వారి ముఖం పై పిగ్మెంటేషన్, మొటిమలతో బాధపడుతున్నారు. ఇంటి చిట్కాల కోసం ప్రయత్నిస్తారు.
ప్రముఖ నటీమణుల చర్మం, కెమికల్ లేకుండా ఇంటి చిట్కాలతోనే సోషల్ మీడియాలో (social media) పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి ముఖ చర్మంపై పిగ్మెంటేషన్, మొటిమల కోసం ఇంట్లో తయారు చేసిన చిట్కాలను పంచుకుంది.
నటి భాగ్యశ్రీ అరటి తొక్కను ముఖానికి పూయడం ద్వారా మొటిమలను ఎలా వదిలించుకోవాలో పంచుకున్నారు. ఈ వీడియోను చాలా మంది లైక్ కొట్టారు.
వీడియోలో నటి అరటిపండు తిని తొక్కను తీసివేయదు. పీల్‌లో సిలికా ఎంటెంట్ కూడా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఫినోలిక్స్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటుంది.
ముఖానికి అప్లై చేసే విధానం..
మీరు అరటి తొక్క లోపలి భాగంలోని తెల్లటి భాగాన్ని మీ ముఖం మీద మొటిమలు, మచ్చలపై సున్నితంగా రుద్దాలి. దాన్ని 15 నిమిషాలపాటు అలాగే ఉంచి.. ఆపై ముఖాన్ని నీటితో కడుక్కోవాలి.
హెల్త్ లైన్ ప్రకారం, ఫైబర్ అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉండే అరటి తొక్క చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. చర్మంపై ముడతలు, మొటిమలను తగ్గిస్తుంది. ఇది మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. అరటి తొక్కలో యాంటీ ఇన్ఫ›్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి.
సోరియాసిస్‌తో బాధపడుతున్నవారు కూడా ఈ అరటి తొక్కతో దురద నుంచి ఉపశమనం పొందవచ్చు. మొత్తానికి అరటి పండు ఆరోగ్యానికి మంచిది. దాని తొక్క చర్మ ఆరోగ్యానికి మంచిది.
వివిధ రకాల అరటిపండు తొక్కను ముఖంపై ఉపయోగించండి. దీంతో అనేక చర్మ సమస్యలు నయం అవుతాయి. మొటిమలను తగ్గించడంతోపాటు మీ ముఖ అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది.
0 Comments:
Post a Comment