Banana : ప్రతి రోజూ ఈ సమయంలో ఒక అరటి పండును తినండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!
Banana : అరటి పండు అత్యంత శక్తిని ఇచ్చే పండు. అరటిలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు శరీరానికి చాలా ఉపయోగపడతాయి. మీరు శారీరక బలహీనతతో బాధపడుతుంటే మీ ఆహారంలో అరటిపండును చేర్చండి.
అది మీకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
అరటిలో ఉండే పోషకాలను చూస్తే.. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-బి, మెగ్నీషియం, విటమిన్-సి, పొటాషియం, విటమిన్-బి 6, థియామిన్, రిబోఫ్లేవిన్ ఉన్నాయి. అరటిలో 64.3 శాతం నీరు, 1.3 శాతం ప్రోటీన్, 24.7 శాతం కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఆరోగ్యకరమైన శరీరానికి ఈ పోషకాలన్నీ అవసరం.
డైట్ నిపుణుడు డాక్టర్ రంజనా సింగ్ ప్రకారం.. అరటిపండ్లలో పొటాషియం ఉంటుంది. ఇది మన కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటిపండులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. అలసటను తగ్గిస్తాయి. మీరు ఉదయం వ్యాయామానికి ముందు ఒకటి లేదా రెండు అరటి పండ్లను తింటే వ్యాయామం చేసేటప్పుడు మీకు ఎక్కువగా అలసట అనిపించదు. పైగా అనేక పోషకాలను, శక్తి,ని, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
1. అరటిలో చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల పొట్ట త్వరగా నిండిపోతుంది. ఉదయం ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లడం వల్ల అల్పాహారం మిస్ అయితే అరటిపండు తిన్న తర్వాత బయటకు వెళ్లండి. ఎందుకంటే అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇది రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.
2. అరటిలో ట్రిప్టోఫాన్ అనే మూలకం ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ కారణంగా మన శరీరంలో సెరోటోనిన్ తయారవుతుంది. సెరోటోనిన్‌ను హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
3. అరటి పండును తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అరటి పండులో ఉండే స్టార్చ్ మన జీర్ణవ్యవస్థకు ముఖ్యమైన మంచి బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది. అరటి పండ్లు యాసిడ్ కు వ్యతిరేకం. కాబట్టి మీకు గుండెల్లో మంట సమస్య ఉంటే అరటిపండు తీసుకోవడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతంది.
4. అరటిలో చాలా ఫైబర్ ఉంటుంది. అదనంగా స్టార్చ్ కూడా అరటిలో కనిపిస్తుంది. ఒక వ్యక్తి అల్పాహారం కోసం అరటి పండు తింటే అతనికి ఎక్కువసేపు ఆకలి అనిపించదు. ఈ విధంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
0 Comments:
Post a Comment