MAA Elections: ‘మా’లో ముసలం.. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ కీలక నిర్ణయం?
Maa elections 2021: ప్రకాశ్‌రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
'రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. మోహన్ బాబు ఎన్నికల ప్రక్రియలోనే కూర్చున్నారు ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారు. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్ నటుడిపై చేయి చేసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన మా సభ్యులు అన్నారు. అందుకే మా ప్యానల్ నుంచి గెలిచిన 11మందికలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం' అని ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు.
మీడియా లో వచ్చినట్లు ఆత్మ , పరమాత్మ , ప్రేతాత్మ లు ఏవి ఉండవని ప్రకాష్ రాజ్ చెప్పారు....
హైదరాబాద్: ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ గత కొద్ది రోజులు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా వినిపించిన మాటలివి. త్వరలో ‘మా’ కుటుంబం ముక్కలు కానుందా? ఎన్నికల ముగిసినా అభిప్రాయ భేదాలు ఇంకా సద్దుమణగలేదా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో గెలిచిన సభ్యులూ ‘మా’ని వీడతారని తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రచారం మొదలైంది. ‘మా’కు పోటీగా మరో అసోసియేషన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ‘ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఆత్మా - ATMAA) పేరుతో కొత్త అసోసియేషన్ ఉండనుందని సమాచారం. ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయవాదం ప్రచారాస్త్రంగా మంచు విష్ణు ప్యానెల్ ప్రచారం చేసింది. తెలుగు నటీనటులు ఉన్న అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా తెలుగువాడినే ఎన్నుకోవాలని పలువురు నటులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీనిపై ప్రకాశ్‌రాజ్ కూడా పలు వేదికల మీద స్పందించారు. తాను తెలుగు వాడిని కాకపోవటం దురదృష్టకరమని అన్నారు. తన తల్లిదండ్రులు తెలుగువాళ్లు కాకపోవటం తన తప్పా? అంటూ వాపోయారు.
ఆదివారం జరిగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. దీంతో ప్రాంతీయవాదం ఉన్న ‘మా’లో తాము కొనసాగలేమని అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి సినీ నటుడు నాగబాబు రాజీనామా చేయగా, మరుసటి రోజే ప్రకాశ్‌రాజ్ కూడా అదే బాటలో నడిచారు. ‘అతిథిలా వచ్చాను.. అతిథిలానే ఉంటాను’ అంటూ ప్రకాశ్‌రాజ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. చివరిగా ‘ఇప్పుడే మొదలైంది’ అంటూ ప్రెస్‌మీట్ ముగించడంతో ఏదో జరగబోతోందని చిత్ర పరిశ్రమలో టాక్ మొదలైంది. అన్నట్లుగానే ఇప్పుడు మరో అసోసియేషన్ ఏర్పాటుపై ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో తాను గెలిచి తమ ప్యానెల్ అధ్యక్షుడు ప్రకాశ్‌రాజ్ గెలవకపోవటం దురదృష్టకరమని శ్రీకాంత్ సైతం విచారం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం 5గంటల తర్వాత ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ప్రెస్‌మీట్ పెట్టనుండటంతో వారు ఏం మాట్లాడతారా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందింది వీరే!
తాజా ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఆధిపత్యం చూపింది. 18మంది సభ్యుల్లో 10మంది విష్ణు ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ(ఉపాధ్యక్షుడు), శ్రీకాంత్(ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), ఉత్తేజ్(జాయింట్ సెక్రటరీ) ఈసీ మెంబర్లుగా శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్, తనీష్, సురేశ్ కొండేటి, సమీర్, సుడిగాలి సుధీర్, కౌశిక్ విజయం సాధించారు.
Live press meet...
0 Comments:
Post a Comment