AP News:భూముల వేలం ద్వారా నిధుల సమీకరణకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు
అమరావతి: నిధుల సమీకరణ సవరణ జీవోకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ భూములను వేలం వేసి నిధులు సమీకరించుకునేలా సవరణ జీవోను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.
ప్రభుత్వ భూముల వేలాన్ని నిషేధిస్తూ 2012లో జారీ అయిన జీవోలోని నిబంధనను తాజాగా తొలగించారు. ఈ నిబంధన తొలగింపుతో రాష్ట్రంలో భూముల వేలానికి మార్గం సుగమం అయింది. 2021 సెప్టెంబర్ 13న పాత నిబంధన తొలగిస్తూ ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చింది. భూముల వేలం ద్వారా నిధుల సమీకరణకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జీవో జారీ చేశారు. దీంతో ఇటీవల జారీ అయిన ఈ ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది.
0 Comments:
Post a Comment