AP PRC 2021 Report - AP Pay Revision Commission 2021 Report Highlights ~ MANNAMweb.com

Search This Blog

Latest Posts ⚡ లేటెస్ట్ పోస్ట్స్

MORE TO VIEW

Friday 29 October 2021

AP PRC 2021 Report - AP Pay Revision Commission 2021 Report Highlights

 AP PRC 2021 Report - AP Pay Revision Commission 2021 Report Highlights

AP PRC 2021 Report - AP Pay Revision Commission 2021 Report Highlights. AP PRC Recommendations on Fitment. This is based on the JSC Meeting and the abstract copy which is circulating in Social Media. AP PRC 2021 Fitment News. AP PRC Committee has recommended fitment of 27% as per th News Scrolling in social media platforms.

PRC RECOMMENDATIONS ON FITMENT

1. The increase in Basic Pay at the minimum level should be such as to fully compensate for the rise in prices of the essential items of human consumption. 

2. It should also accommodate certain new items of expenditure which have to be incurred for a decent and dignified living in a modern civilised society. 

3. The quantum of rise in wages in percentage terms should be uniform across all segments of employees in the interest of fairness and equity 

4. The fitment benefit should be allowed so as to bridge the gap between the increase in Minimum Pay, as determined based on the ILC norms, on 01-07-2018, over that lived as on the date of implementation of the last RPS (e. 01-07-2013) less the neutralization of inflationary impact on prices of essential items or consumption effected through the merger of Dearness Allowance with Basic Pay Based on this principle, In the present case the fitment works out to 23%. 

5. However, pending receipt of Report of this Commission, on the request of the service associations the State Government has already approved an Interim Reliel @ 27% of Basic Pay with monetary benefit from 01-07-2019 vide G.O.Ms. No.60 Finance (PC & TA) Department dated 06 07-2019. Government has further ordered that the Interim Relief shall be adjusted against any benefit that may accrue to the employees on account of revision of scales of pay and other allowances as a result of Government's decision on the Report of the Pay Revision Commission. Based on the above, the Commission recommends the following formula for pay fixation in the revised scales:

a) The existing Basic Pay in the pre-revised scales may be taken into account;

b) Dearness Allowance admissible as on 01.07.2018 (as per AICPIN figures) may be calculated @ 30.392% on (a) above;

c) A fitment benefit of 27% of (a) above may be arrived at;

d) The revised basic pay in the new pay scale applicable to the post shall be fixed at the stage next above the figure arrived at after adding (a), (b) and (c) above or alternatively by multiplying the figure at (a) above by a fitment factor of 1.57392;

e) If an employee's pay, when fixed as above, falls short of the minimum in the relevant revised pay scale, it shall be fixed at the minimum of the scale.

f) If the amount so fixed exceeds the maximum of the appropriate revised scale, the difference shall be treated as personal pay and should be absorbed in future pay increases or in stagnation increments (maximum five) sanctioned, if any.

7. The Commission recommends that the pay fixation in the revised pay scales take effect from 01.07.2018. The Commission however deems it appropriate to leave the decision, regarding the date from which monetary benefit of such fitment should be given to the Government depending on its resources position.

BENEFIT ON IR TILL NOW

State Government has approved an Interim Relief @ 27% of Basic Pay with monetary benefit from 01-07-2019 vide G.O.Ms. No.60 Finance (PC & TA) Department dated 06-07-2019. Expenditure on IR till now is estimated at Rs.16,281 cr as shown below.

✨ తాజా:: పి ఆర్ సి సంక్షిప్త నివేదిక విడుదల

★ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ నివేదిక ముఖ్యాంశాలు ఒక పేజీలో ప్రభుత్వం విడుదల చేసింది.

★ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వివరాలు అందించింది. పూర్తి నివేదికను మూడు రోజుల్లో ప్రభుత్వం వెల్లడించనుంది. 

★ ఈ నివేదిక లో ఫిట్మెంట్ తేల్చేందుకు ఉద్దేశించిన ఫార్ములా ప్రకారం 23 శాతమే ఫిట్మెంట్ లెక్క తేలిందని కమిషన్ పేర్కొంది.

★ ఇప్పటికే ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇస్తున్నందున తదనుగుణంగా వేతన కమిషన్ ప్రభుత్వ సూచనతో సర్దుబాటు చేసిందని పేర్కొంది. 

★ మరో మూడు పాయింట్లు ఆధారంగా ఫిట్మెంట్ 27 శాతం వరకు అమలు చేయవచ్చని సూచించింది. 

★ ఇందుకు సంబంధించి ఈ శాతాన్ని ఎలా సాధించిందో కొన్ని నిబంధనలు వేతన సవరణ కమిషన్ పేర్కొంది.



✍పీఆర్సీ ‘ఫట్‌’మెంట్‌!

♦ఐఆర్‌ 27 శాతమే ఫిట్‌మెంట్‌గా ఫిక్స్‌!

♦జేఎస్సీ భేటీలో సీఎస్‌ సంకేతాలు!?

♦విస్తుపోయిన ఉద్యోగ సంఘాల నేతలు

♦తూతూ మంత్రంగానే సాగిన సమావేశం

♦దేనిపైనా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

♦ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలన్న సీఎస్‌

♦సర్కారు వైఖరిపై ఉద్యోగ నేతల అసంతృప్తి

♦వారం, పది రోజుల్లో స్పష్టత ఇవ్వకుంటే కార్యాచరణ

♦ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి నేతల హెచ్చరిక 

🌻అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): 

 ‘మంచి ఫిట్‌మెంట్‌’తో వేతన సవరణ వస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు ‘షాక్‌’ ఇవ్వనుందా? ‘జీతం పెరిగే సంగతి పక్కనపెట్టండి. తగ్గకుండా చూడండి’ అని ఉద్యోగులు సర్కారును వేడుకునే పరిస్థితి రానుందా? శుక్రవారం జరిగిన ‘జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌’ సమావేశంలో ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి సంకేతాలే వెలువడ్డాయి. ‘ఫిట్‌మెంట్‌ 23 శాతం మాత్రమే ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసింది. ఇప్పటికే ఇస్తున్న ఐఆర్‌ 27 శాతాన్నే ఫిట్‌మెంట్‌గా ఖరారు చేస్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ చెప్పినట్లు తెలిసింది. దీంతో... ఉద్యోగ సంఘాల నేతలు అవాక్కయ్యారు. పీఆర్సీ పెండింగ్‌లో ఉండగా... తాత్కాలిక ఉపశమనం కోసం ఐఆర్‌ ఇస్తారు. పీఆర్సీ దానికంటే ఎక్కువే ఉండాలి. కానీ... ఐఆర్‌నే ఫిట్‌మెంట్‌గా ఖాయం చేస్తామనడం ఎంతమాత్రం సరికాదని ఉద్యోగ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘దసరా కానుకగా పీఆర్సీ, ఈ నెలాఖరులోపు పీఆర్సీ’ అంటూ ఊరించిన సర్కారు... జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ (జేఎస్సీ) సమావేశంలో తుస్సుమనిపించింది. ఈ సమావేశంలో ఏ అంశాలపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పైగా... పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దనే సంకేతాలు పంపింది. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఆధ్వర్యంలో జేఎస్సీ సమావేశం జరిగింది. ఈ భేటీలో గుర్తింపు పొందిన 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు తదితర సమస్యలపై సమావేశంలో ఉద్యోగ సంఘాలు గట్టిగానే నిలదీసినట్లు తెలిసింది. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండానే దీనిపై ఎలా మాట్లాడతామని నేతలు ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ... ‘‘పీఆర్సీ సిఫారసులను వీలైనంత త్వరలో అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.  దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై వచ్చేవారం పీఆర్సీ కమిటీ అధికారులతో సమావేశమై చర్చిస్తాం. పీఆర్సీ నివేదికను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు’’ అని తెలిపారు. అదే సమయంలో... రెండేళ్లుగా కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. అదే సమయంలో... ఐఆర్‌గా ఇచ్చిన 27 శాతాన్నే ఫిట్‌మెంట్‌ చేస్తామనే సంకేతాలు పంపినట్లు తెలిసింది. త్వరలో పీఆర్సీ అమలు చేస్తామని.. నివేదిక సారాంశాన్ని వారంలోగా అందిస్తామని సీఎస్‌ చెప్పారు. ఇక... కాంట్రాక్టు ఒప్పంద ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సర్వీసెస్‌ హెఆర్‌ ముఖ్య కార్యదర్శితో ఒక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. సీపీఎస్‌ రద్దు అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామని.. ఈ విషయంపై సీఎం జగన్‌ స్పష్టమైన వైఖరితో ఉన్నారని తెలిపారు. ‘‘ఇది  ప్రాథమిక సమావేశం మాత్రమే. మరోసారి భేటీ అవుదాం. మీ డిమాండ్లు సీఎం దృష్టికి తీసుకెళ్తాం’’ అని సమీర్‌ శర్మ హామీ ఇచ్చారు.


ఉద్యోగ సంఘాల అసంతృప్తి

ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ఒక్క అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఉద్యోగ సంఘాల నేతలు నిట్టూర్చారు. 11వ పీఆర్సీ కమిషన్‌ వేతన సవరణ నివేదికలోనిదంటూ ప్రభుత్వం విడుదల చేసిన ఒక పేజీ నోట్‌ ఆ నివేదికలోని కాదని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులకు ఐఆర్‌ ఇవ్వడం వల్ల ఎంత ఖర్చయిందో అందులో తెలిపారు. నివేదిక సిద్ధం చేసిన అశుతోశ్‌ మిశ్రా ముందే ఊహించి ఐఆర్‌పై అక్టోబరు వరకు ఎంత ఖర్చయిందో ఎలా చెబుతారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు... సీపీఎస్‌ రద్దుకు సీఎం కట్టుబడి ఉన్నారని, దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పడంపైనా ఉద్యోగులు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. 

కంటితుడుపు సమావేశం: ఉద్యోగ సంఘాలు

పీఆర్సీపై వారం, పదిరోజుల్లో స్పష్టత ఇవ్వకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని కంటితుడుపు చర్యగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. శుక్రవారం రాత్రి వారు విలేకరులతో మాట్లాడారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఏ అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి, అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దుపై తేల్చాలని, మిగిలిన ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశామన్నారు. ఉద్యోగుల సమస్యలు వేటిపైనా ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారని అందుకే సమావేశాన్ని బహిష్కరించలేదన్నారు. ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... 11వ పీఆర్సీపై స్పష్టత లేదన్నారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు మాట్లాడుతూ నవంబరు 1నుంచి నూతన విద్యావిధానం పేరుతో 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలల నుంచి హైస్కూళ్లకు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పామన్నారు. యాప్‌లను తొలగించాలని కోరామన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక కాపీ ఇచ్చిన తర్వాతే మాట్లాడతామని చెప్పామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు, సౌకర్యాలపై, ఆర్థికపరమైన నిర్ణయాలపై సమావేశంలో ఒక నిర్ణయానికి రానందున మీడియా ముందుకు రావడంలేదని ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top