AP News : ఇళ్లల్లో కరెంట్ వాడకం తగ్గించుకోండి: ప్రజలకు సజ్జల విజ్ఞప్తి
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సమస్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు విధించాల్సి రావొచ్చని హెచ్చరించారు. ఇళ్లల్లో కరెంట్ వాడకం తగ్గించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాత్రి 6-10 గంటల మధ్య విద్యుత్ వినియోగం తగ్గించాలని సూచించారు. బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య వచ్చిందని, డబ్బు వెచ్చించినా ఇది పరిష్కారమయ్యే పరిస్థితి లేదని వివరించారు. విద్యుత్ అంశంపై కంఏద్రమంత్రి చెప్పింది అవాస్తవమన్నారు. సీఎం ఇప్పటికే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని సజ్జల చెప్పారు.
‘‘‘ఇళ్ల స్థలాల పేరుతో లబ్ధిదారులకు తెలియకుండానే కేసులు నమోదవుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు శరాఘతంలా మారింది. అఫిడవిట్లు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని తెదేపా అడ్డుకుంటోంది. హైకోర్టు సింగిల్ బెంజ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‌కు వెళ్తాం. డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వానికి న్యాయం జరిగే అవకాశం ఉంది’’ అని సజ్జల అన్నారు.
0 Comments:
Post a Comment