AP High Court: ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై మధ్యంతర ఉత్తర్వులు
అమరావతి: ఏపీలో ఎయిడెడ్ పాఠశాలల విలీనం ప్రక్రియపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎయిడెడ్ పాఠశాలల విలీనానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్, జీవోలను సవాల్ చేస్తూ పలు విద్యాసంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఎయిడెడ్ పాఠశాలల విలీనానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్, జీవోలను సవాల్ చేస్తూ పలు విద్యాసంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వాటిపై ఇవాళ విచారణ జరిగింది. ఈ నెల 22లోపు అన్ని పిటిషన్లకు కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 28 వరకు విద్యా సంస్థలపై ఒత్తిడి చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
విల్లింగ్ ఇవ్వలేదని విద్యాసంస్థలకు గ్రాంట్ ఆపొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకురావట్లేదని ఇష్టపూర్వకంగా ఇస్తేనే విల్లింగ్ను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు. అనంతరం విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.
0 Comments:
Post a Comment