AP Farmers: రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ నెలలోనే రెండో విడుత రైతు భరోసా నిధులు విడుదల
స్పందనపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని సూచనలు చేశారు.
ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మెటీరియల్ కాంపొనెంట్ వినియోగంపై ఫోకస్ పెట్టాలన్నారు. కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనకబడి ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. వెంటనే సచివాలయాల భవనాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తిచేయాలన్నారు. కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఈ పనులపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.
వైయస్సార్ హెల్త్ క్లినిక్స్‌పైనా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గ్రామాల్లో డిజిటిల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామని.. అవాంతరాలు లేకుండా ఇంటర్నెట్‌ను సరఫరా చేయాలన్నారు. దీనివల్ల వర్క్‌హోం కాన్సెప్ట్ సాకారం అవుతుందని చెప్పారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై ఫోకస్ పెంచాలని.. తొలి విడతలో 4314 లైబ్రరీలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ లైబ్రరీల నిర్మాణానికి సంబంధించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
పంట కొనుగోలు జరగాలంటే ఇ- క్రాపింగ్ చేయాలని సీఎం సూచించారు. ఇ- క్రాపింగ్ చేయించడమన్నది ఆర్బీకేల ప్రాథమిక విధి అని చెప్పారు. ఇ- క్రాపింగ్‌పైన కలెక్టర్లు, జాయంట్ కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడ రైతులకు ధరల విషయంలో నిరాశజనక పరిస్థితులు ఉన్నా.. సీఎం యాప్ ద్వారా… పర్యవేక్షణ చేసి వెంటనే రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇ- క్రాపింగ్ చేసిన తర్వాత డిజిటల్ రశీదుతోపాటు, భౌతికంగా కూడా రశీదు ఇస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించాలని చెప్పారు. గ్రామంలోని ప్రతి ఎకరా కూడా ఇ-క్రాపింగ్ జరగాల్సిందేనని చెప్పారు. ఇ- క్రాపింగ్ ఉంటనే పంటలబీమా, సున్నావడ్డీ, పంట కొనుగోళ్లు, ఇన్‌పుట్ సబ్పిడీ … ఇవన్నీకూడా సవ్యంగా జరుగుతాయని సీఎం పేర్కొన్నారు.
అగ్రికల్చర్ అడ్వైయిజరీ మీటింగ్స్ కచ్చితంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల స్థాయిలో, రెండో శుక్రవారం మండలస్థాయిలో, మూడో శుక్రవారం జిల్లాల స్థాయిలో అడ్వైయిజరీ సమావేశాలు జరగాలని సూచించారు. నాలుగో శుక్రవారం వ్యవసాయశాఖ కార్యదర్శి సమక్షంలో రాష్ట్రస్థాయిలో సమావేశం జరగాలని.. ఈ సమావేశాల్లో వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నాణ్యమైన వాటిని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు. నెల్లూరులో జరిగిన ఘటన తన దృష్టికి వచ్చిందన్న సీఎం… కఠిన చర్యలు తీసుకోమని చెప్పినట్లు వివరించారు. ఎంప్యానెల్ అయిన కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులనే ఇవ్వాలని.. సీడ్‌కార్పొరేషన్.. ఈ ఉత్పత్తులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.
ఆర్బీకేల ద్వారా ఇస్తున్నవాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దని పేర్కొన్నారు సీఎం జగన్. కలెక్టర్లు నుంచి అందరూ కూడా సమిష్టిగా బాధ్యత వహించాలని చెప్పారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఉంచడానికి ఆర్బీకేల్లోనే గోడౌన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అప్పటివరకూ స్టోరేజీకోసం… అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకోమన్నారు. నాకు పలానాది కావాలని రైతులు అడిగితే.. ఆర్బీకే ద్వారా ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సరఫరా కావాలని ఆదేశించారు. అందుకనే వీలైనంత త్వరగా ఆర్బీకేలను పూర్తిచేయాలని సూచించారు. అంతవరకూ తాత్కాలిక ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలన్నారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఉంచమని చెప్పినట్లు సీఎం గుర్తు చేశారు. వారి విధులు, కార్యకలాపాలపై కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. అన్ని ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చామని.. వారికి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వారికి రైతు భరోసా సహా.. అన్నిరకాలుగా అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. ఇన్‌పుట్‌సబ్సిడీ , బీమాతో పాటు పంట కొనుగోలుకు కూడా భరోసా ఇస్తున్నామన్నారు సీఎం జగన్. ఇలాంటి సందర్భాల్లో వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనకడుగు వేయాల్సిన పనిలేదన్నారు. అందుకే వారికి రుణాలు అందేలా కలెక్టర్లు దృష్టిపెట్టాలని సూచించారు. నవంబర్ నుంచి రబీ పనులు ఊపందుకుంటాయని.. రబీకి అవసరమైన విధంగా అధికారులు సన్నద్ధం కావాలన్నారు. 62శాతం మంది ప్రజలు పరోక్షంగా, ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంపైన ఆధారపడి ఉన్నారని.. ఈ రంగం ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయం ప్రతిక్షణం మీరు మనసులో పెట్టుకోవాలని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దీనిమీదే ఆధారపడి ఉందని సీఎం పేర్కొన్నారు.
జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం విప్లవాత్మకమైనదని సీఎం జగన్ చెప్పారు. 100 సంవత్సరాల క్రితం సర్వే అయ్యిందని.. 100 ఏళ్ల తర్వాత సర్వే, రికార్డులను అప్‌డేట్ చేస్తున్నట్లు సీఎం వివరించారు. దీని ద్వారా గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా చెక్ పడుతుందని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటుందని.. పైలట్‌ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో ఈ సర్వే జరుగుతుందని చెప్పారు. మరో 650 గ్రామాల్లో డిసెంబర్‌కల్లా పూర్తవుతుందని చెప్పారు. 2023 జూన్‌కల్లా మొత్తం సర్వే ప్రక్రియ ముగుస్తుందని వెల్లడించారు. కలెక్టర్లు, జాయింట్‌కలెక్టర్లు అంకిత భావంతో దీన్ని అమలు చేయాలని.. సర్వే అవగానే రికార్డులు అప్‌డేట్ అవుతాయని, కొత్త పాసుపుస్తకాలు యజమానులకు ఇస్తామని తెలిపారు.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పథకం వల్ల లక్షలమందికి ఉపయోగం ఉంటుందని చెప్పారు. 47.4 లక్షల మంది లబ్ధి పొందుతారన్నారు. పట్టాలు వీరిచేతికి అందుతాయని.. వారి ఇంటి స్థలంమీద వారికి అన్నిరకాల హక్కులు వస్తాయన్నారు. దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. ఈ పథకంమీద క్రమం తప్పకుండా సీఎస్ కూడా రివ్యూ చేస్తారని చెప్పారు. డిసెంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.
అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత సీఎం తెలిపారు. 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు. నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. 10 రోజుల ఆసరా కార్యక్రమాలను నిర్వహించిన కలెక్టర్లు, అధికారులందరికీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు.
0 Comments:
Post a Comment