రాత్రి 8-10 గంటల మధ్యే టపాసులు కాల్చాలి
హరిత టపాసులే వినియోగించాలి
కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఏకే పరీడా
❇️అమరావతి: దీపావళి పండగ నాడు రాత్రి 8-10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఏకే పరీడా తెలిపారు. కేవలం హరిత టపాసులతోనే (గ్రీన్ క్రాకర్స్) పండగ నిర్వహించుకోవాలని చెప్పారు. కొవిడ్ మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలెవరూ మామూలు టపాసులు కాల్చొద్దని అన్నారు. సాధారణ వాటితో పోలిస్తే హరిత టపాసులు తక్కువ మోతాదులో బూడిద, ధూళి కణాలు, కాలుష్య కారక వాయువులు, శబ్దం, పొగ విడుదల చేస్తాయి’’ అని ఆయన ఈ ప్రకటనలో వివరించారు.
0 Comments:
Post a Comment