Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 5 October 2021

Android Apps: మీ మొబైల్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి.. 26 డేంజర్‌ యాప్స్‌ను గుర్తించిన గూగుల్‌

 Android Apps: మీ మొబైల్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి.. 26 డేంజర్‌ యాప్స్‌ను గుర్తించిన గూగుల్‌


Android Apps: టెక్నాలజీ పెరిగేకొద్ది సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు.

మాల్‌వేర్‌లతో దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వాడేవారినే టార్గెట్‌ చేస్తున్నారు నేరగాళ్లు. ఫేక్ యాప్‌లతో సైబర్ క్రిమినల్స్ అడ్డంగా మోసగిస్తున్నారు. దీనికి సంబంధించి గూగుల్ ఎప్పటికప్పుడు తన యూజర్లను అలర్ట్ చేస్తూనే వస్తోంది. మాల్‌వేర్‌ యాప్స్‌ను ఎప్పటికప్పుడు వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగిస్తోంది. అలాగే, మొబైల్ యూజర్లు ఒకవేళ తమ ఫోన్ లో వాటిని ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తుంది. తాజాగా గూగుల్ మరోసారి మొబైల్ యూజర్లను అలర్ట్ చేసింది. 26 అండ్రాయిడ్‌ యాప్స్‌ను బ్యాన్ చేసింది. గ్రిఫ్ట్ హార్స్ అండ్రాయిడ్‌ ట్రోజన్ కలిగివున్న ఆ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేయాలని, లేకపోతే నిలువునా మోసపోతారని హెచ్చరిస్తోంది. 26 యాప్‌ల ద్వారా యూజర్ల డబ్బును హ్యాకర్లు కాజేస్తున్నట్టు గూగుల్ గుర్తించింది.

గూగుల్ నిషేధించిన టాప్ 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటి అంటే.. హ్యాండీ ట్రాన్స్ లేటర్ ప్రో, హార్ట్ రేట్, పల్స్ ట్రాకర్, లాకర్ టూల్, జియోస్పాట్, జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, ఐకేర్ – ఫైండ్ లొకేషన్, బస్ – మెట్రోలిస్ 2021, ఫ్రీ ట్రాన్స్ లేటర్ ఫోటో, మై చాట్ ట్రాన్స్ లేటర్, ఫింగర్ ప్రింట్ ఛేంజర్, కాల్ రీకోడర్ ప్రో వంటివి ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న యాప్స్‌ను దాదాపు 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందుకే మీ మొబైల్ లో గనుక ఈ కింద పేర్కొన్న యాప్స్ ఉంటే వెంటనే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రమాదకరమైన 26 యాప్స్ ఇవే..

1. Handy Translator Pro

2. Heart Rate and Pulse Tracker

3. Geospot: GPS Location Tracker

4. iCare - Find Location

5. My Chat Translator

6. Bus - Metrolis 2021

7. Free Translator Photo

8. Locker Tool

9. Fingerprint Changer

10. Call Recoder Pro

11. Instant Speech Translation

12. Racers Car Driver

13. Slime Simulator

14. Keyboard Themes

15. What's Me Sticker

16. Amazing Video Editor

17. Safe Lock

18. Heart Rhythm

19. Smart Spot Locator

20. CutCut Pro

21. OFFRoaders - Survive

22. Phone Finder by Clapping

23. Bus Driving Simulator

24. Fingerprint Defender

25. Lifeel - scan and test

26. Launcher iOS 15

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top