ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ (Fee Reimbursement Scheme) పై వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని, ప్రభుత్వం వచ్చే నెలలో మూడో త్రైమాసికాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (Andhra Pradesh State Council of Higher Education) స్పష్టం చేసింది.
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 87 శాతం మంది విద్యార్థులకు ట్యూషన్ ఫీజు రీయింబర్స్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కౌన్సిల్ తెలిపింది. ఏపీఎస్‌సీహెచ్ఈ (APSCHE) చైర్మర్ పి.హేమచంద్రారెడ్డి ఈ విషయంపై మాట్లాడారు. విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన కింద రీయింబర్స్‌మెంట్ ద్వారా దాదాపు రూ .4,000 కోట్లు చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదనే ఆరోపణలను ఖండిస్తూ, 2018-19 విద్యా సంవత్సరానికి రూ .1880 కోట్లు, 2019-20కి రూ. 2,200 కోట్లు మరియు సీనియర్ విద్యార్థులకు రూ .770 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా చెల్లించారని వివరించారు.
తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి..
నవంబర్ 30, 2019 నుండి, విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని పి.హేమచంద్రారెడ్డి చెప్పారు. మునుపటి ప్రభుత్వంలా కాకుండా వైఎస్ఆర్‌సీపీ (YSRCP) ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు, డిగ్రీ మరియు పీజీ విద్యార్థులకు రూ .20,000 వరకు స్కాలర్‌షిప్‌ని అందించినట్లు ఆయన గుర్తు చేశారు.
మొదటి త్రైమాసికంలో విద్యార్థి (Students) తల్లి ఖాతాల్లోకి దాదాపు రూ .670 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ .693.27 కోట్లు జమ అయ్యాయని హేమచంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంవత్సరం మూడవ త్రైమాసికానికి, అక్టోబర్‌కు బదులుగా నవంబర్‌లో రీయింబర్స్‌మెంట్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ప్రకటించారు.
పెండింగ్ ఫీజులు కడతారు..
కాలేజీలకు ఫీజు చెల్లింపుకు సంబంధించి.. మొదటి త్రైమాసికంలో 91.2 శాతం మంది తల్లులు ఫీజు చెల్లించగా, రెండవ త్రైమాసికంలో 42.2 శాతం మంది మాత్రమే ఫీజు చెల్లించినట్టు ఆయన తెలిపారు. అయితే, వారందరూ పెండింగ్ ఫీజులను క్లియర్ చేస్తారని ఆయన చెప్పారు.
2024 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్ఈ సెలబస్
రాష్ట్ర వ్యాప్తంగా 2024 నాటికల్లా అన్ని పాఠశాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుబంధాన్ని పొందడానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీబీఎస్ఈ నిబంధనలు పాటించేలా ప్రభుత్వం ప్రతీ పాఠశాలను అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రతీ పాఠశాలకు ప్లే గ్రౌండ్..స్కూల్‌లను మ్యాపింగ్ అందుబాటులోకి తీసుకు వచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
CBSE సిలబస్ విధానం..
- సీబీఎస్‌సీలో సైన్స్, గణితం అప్లికేషన్ ఆధారిత సబ్జెక్టులపై ప్రధాన దృష్టి పెట్టబడుతుంది.
- బోధనా విధానం ఇంగ్లీష్ అండ్ హిందీ.
- అన్ని కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు CBSE మార్గదర్శకాలను అనుసరించాలి.
- ఇది సబ్జెక్టులలో శాస్త్రీయ పద్ధతులకు ప్రాముఖ్యతను ఇస్తుంది.
- తరచుగా సిలబస్‌ని సమీక్షించి అప్‌డేట్ చేస్తుంది.
0 Comments:
Post a Comment