Admissions for 4,400 people in Triple IT - Chancellor Professor Casey Reddy
ట్రిపుల్ ఐటీల్లో 4,400 మందికి ప్రవేశాలు
- చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి
🌻ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ట్రిపుల్ ఐటీ) క్యాంపస్లలో ఈ ఏడాది 4,400 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి చెప్పారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు వచ్చిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి క్యాంపస్ లో 1000 సీట్లు, 100 సీట్లు ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కోటా కింద ప్రవేశా లు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ నెల 22 తర్వాత ప్రీ యూనివర్శిటీ (పీయూసీ ) మొదటి సంవత్సరం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. నవంబర్ ప్రవేశాలు, డిసెంబర్ నుంచి తరగతులు నిర్వహిస్తామన్నా రు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి, రెండు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహిం చనున్నట్లు తెలిపారు. 175 మంది బోధన సిబ్బంది నియా మకానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు.
0 Comments:
Post a Comment