Acer Swift 3 laptop : అమెజాన్ భారీ డిస్కౌంట్
Amazon Great Indian Festival : పండుగల వేళ ఎలక్ట్రానిక్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
దసరా, దీపావళి పండుగలను క్యాష్ చేసుకోవాలని ఆయా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ల్యాప్ ట్యాప్ తయారు చేసే కంపెనీలు కూడా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కామర్స్ సైట్స్ లో ఒకటైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించింది. అందులో భాగంగా 'ఏసర్ స్విఫ్ట్ 3' ల్యాప్ ట్యాప్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. సేల్ కొత్తగా విడుదలైన కొత్త గ్యాడ్జెట్స్ పై ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది.
ఏసర్ స్విఫ్ట్ 3 ఫీచర్లు :-
ఏసర్ స్విఫ్ట్ 3 ఫీచర్లు విషయానికి వస్తే.. 1920 x 1080 రెజల్యూషన్ తో 14 అంగుళాలు ఫుల్ HD ఐపీఎస్ డిస్ ప్లే ఉంది. 18 GB DDR 4 Ram, 512 GB SSD, AMD రెజైన్ 5 5500u హెక్సా – కోర్ ప్రాసెసర్ సౌకర్యం ఉంది. 64 బిట్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కు అనుగుణంగా రూపొందించారు. కలర్ కాంట్రాస్ట్ కోసం Led బ్యాక్ కంపైవ్యూ టెక్నాలజీ అందిస్తుంది. హై క్వాలిటీ వీడియోలను కూడా రెండరింగ్ చేసుకొనే వీలుంది. ఇందుకు AMD రేడియన్ గ్రాఫిక్స్ ఉంది. వేగంగా డేటాను స్టోర్ చేసేందుకు SSD డ్రైవ్ అమర్చారు. సెక్యూర్టీ కోసం ఫింగర్ ప్రింట్, వాయిస్ అలర్ట్ ఇచ్చేందుకు అలెక్సా ఉంది.
ధరలు : –
ఏసర్ స్విఫ్ట్ 3 :- ల్యాప్ ట్యాప్ ధర రూ. 89 వేల 999 ఉండగా…గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ. 30 వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. పాత ల్యాప్ ట్యాప్ ఎక్స్చైంజ్ చేస్తే…రూ. 18 వేల 100 వరకు ఆఫర్ పొందవచ్చు.
0 Comments:
Post a Comment