ఏపీలో ప్రభుత్వ పనులు అనగానే ముందుకొచ్చే కాంట్రాక్టర్లు ఒక్కటయ్యారు.
ప్రభుత్వం పైన నిరసనలకు దిగారు. రోడ్ల పైకి వస్తున్నారుద. ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించినా ముందుకు రాని కాంట్రాక్టర్లు నిరసన ల పేరుతో రోడ్ల పైకి వస్తున్నారు. ఏపీలో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన ఉండటం లేదు. బకాయిలు చెల్లిస్తేనే తాము కొత్త పనులకు టెండర్లు వేస్తామంటూ కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వం పైన మరిం ఒత్తిడి పెంచటానికి సిద్దమయ్యారు. ఈ రోజున విజయవాడలో ఆ"వేదన" పేరుతో తమ బాధలు చెప్పుకొనేందుకు సిద్దమయ్యారు.
వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయంటూ...
తమకు ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని..ఎంత అడిగినా చెల్లింపులు జరగటం లేదంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించి దాదాపుగా రూ 80 వేల కోట్ల రూపాయాల బిల్లులు చెల్లించకుండా పెండింగ్ ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఈ మొత్తం ఎంత అనేది తేల్చాల్సి ఉంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో వేల కోట్ల రూపాయలు విలువైన పనులు చేసిన కాంట్రాక్టర్లు తమ ఆక్రోశాన్ని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు.
ఫ్లెక్సీలు..పోస్టర్లతో నిరసనలు
ఇరిగేషన్ శాఖలో అధిక మొత్తంలో బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా పది వేల కోట్ల రూపాయాలకు పైగా ఇప్పటికే క్లియర్ కావాల్సిన బిల్లులు ఉన్నాయని సమాచారం. అదే విధంగా ఆరోగ్య శాఖలో మరో రెండు వేల కోట్లు...రోడ్లు- భవనాల శాఖలో రూ 700 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇందులో మెజార్టీ బిల్లులు గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించనవిగా తెలుస్తోంది. తాజాగా ఆరోగ్యశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌లో ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. కాకినాడలో ఇవే రకమైన పోస్టర్లు దర్శనమిచ్చాయి.
ప్రభుత్వం పైన కాంట్రాక్టర్ల ఉద్యమం
దీంతో..కాంట్రాక్టర్లు అంతా పనుల విషయంలో సిండికేట్ అయినట్లే..ఇప్పుడు ప్రభుత్వం పైన ఉద్యమం ప్రకటించినట్లుగా కనిపిస్తోంది.అయితే, కాంట్రాక్టర్లు మాత్రం ఇది ప్రభుత్వం పైన ఉద్యమం కాదని..తమ ఆవేదన తెలియచేయటమేనని చెబుతున్నారు. చాలా మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి వచ్చిన పనులు చేయటానికి రుణాలు తీసుకున్నారు. వ్యక్తిగతంగా అప్పులు చేసారు. తమ ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తెచ్చి పనులు పూర్తి చేసారు. వడ్డీలు ఇప్పటికీ కడుతున్నారు. అయినా..ఇప్పటికీ ప్రభుత్వం నుంచి బిల్లుల బకాయిలు రాకపోవటంతో వారు ఆర్దికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
కాంట్రాక్టర్ల ఆవేదన పేరుతో సమావేశం
అనేక మార్లు ప్రభుత్వంలోని ముఖ్యుల వద్దకు..తమ పనులు చేసిన శాఖల ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నామని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేటాయించిన ప్రాజెక్టుల విషయంలో కొందరికే దక్కాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరికి మినహా ఇతర కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగటం లేదనే వాదన వినిపిస్తోంది. ఆరోగ్య శాఖ అనుబంధ విభాగాల్లోనూ పెద్ద మొత్తంలో బిల్లులు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని కలిపి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ స్పందన పైన ఆసక్తి
ఆరోగ్యశాఖలో కొత్త మెడికల్ కాలేజీలు, నాడు - నేడు ప్రాజెక్టుల పనులు ప్రారంభం అయ్యాయి. బిల్లులు విడుదల కాకపోవడంతో చాలా కంపెనీలు, సప్లయిర్స్....కార్పొరేషన్‌కు మందులు, సర్జకల్ పరికరాలు, వైద్య వస్తువులు సరఫరా చేయడం తమవల్ల కాదని లేఖలు కూడా రాశాయి. గత నెల రోజుల వ్యవధిలో సుమారు 10 పైగా కంపెనీలు ఇలాంటి లేఖలు సమర్పించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు విజయవాడలో ఆ"వేదన" పేరుతో తమ బాధలు చెప్పుకొనేందుకు ఒక్కటిగా కదులుతున్నారు. దీని పైన ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
0 Comments:
Post a Comment