నవంబరు 8 నుంచి విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు.
75శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకానికి అర్హులు..
రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 8 నుంచి విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో దీన్ని అమలు చేస్తున్నారు. నవంబరు 8 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఉన్న హాజరును ప్రామాణికంగా తీసుకోనున్నారు. మొత్తం 130 పాఠశాల పనిదినాల్లో 75శాతం హాజరు ఉంటేనే అమ్మఒడికి అర్హులుగా పరిగణిస్తారు. బయోమెట్రిక్ అప్లికేషన్ యాప్‌ను సిద్ధం చేశారు. ప్రయోగాత్మక పరిశీలన తర్వాత వీటిల్లో మార్పులు చేయనున్నారు. ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్‌ను పెడుతున్నారు. చాలా చోట్ల పిల్లల వేలిముద్రల్లో మార్పుల కారణంగా ఆధార్ నవీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment