ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం
అర్హత కలిగిన ఎస్జీటీలకు సబ్జెక్టు బోధనకు అనుమతి
నవంబరు ఒకటి నుంచే నూతన విద్యా విధానం అమలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానాన్ని నవంబరు ఒకటి నుంచి అమలు చేయనున్నారు.
ఇందులో భాగంగా 250 మీటర్ల దూరంలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఉన్నత పాఠశాలలకు నిర్ణీత దూరంలోని ప్రాథమిక పాఠశాలల గుర్తింపు, విద్యార్థుల తరలింపు, అర్హులైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఈనెల 31నాటికి పూర్తి చేసే బాధ్యతను డీఈవోలకు అప్పగించారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో బహుళ తరగతులను నిర్వహిస్తుండటంతో అభ్యసన ఫలితాలు సక్రమంగా లేవని, 1-5 తరగతులకు ఒకరిద్దరు ఉపాధ్యాయులే బోధిస్తున్నందున 18 సబ్జెక్టులను కవర్ చేయలేకపోతున్నారని విద్యాశాఖ పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 3-5 తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులు, 1-2 తరగతులకు ప్రత్యేక ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.
ఇదీ విధానం
* ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను 250 మీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. 1, 2 తరగతులు యధావిధిగా కొనసాగుతాయి.
* 1, 2 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలను 1:30 నిష్పత్తిలో నియమిస్తారు.
* ఎస్జీటీల్లో జూనియర్‌ను 1, 2 తరగతుల బోధనకు వినియోగిస్తారు. సీనియర్ ఎస్జీటీల్లో 3-10 తరగతులకు బోధించే అర్హతలు లేకుంటే ఆ అర్హతలున్న జూనియర్‌కు అవకాశమిస్తారు.
* 3-10 తరగతులకు ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల నుంచి వచ్చిన వారు బోధిస్తారు.
* ఉన్నత పాఠశాలల్లో 3-10 తరగతుల నిర్వహణకు సరిపడా గదులు లేకుంటే... ప్రాథమిక పాఠశాల గదుల్లోనే 3, 4, 5 తరగతులను కొనసాగిస్తారు.
3,4,5 తరగతుల తరలింపులో ఉపాధ్యాయ పోస్టులు ఉన్నత పాఠశాలలకు బదలాయింపు పై... ప్రతిపాదనలు.
ఉన్నత పాఠశాలల్లో ప్రాధమిక పాఠశాలల విలీన ప్రక్రియ - ముసాయిదా
ఉన్నత పాఠశాల ఆవరణలో / ప్రక్కనే / 250 మీటర్ల దూరం లోపు గల ప్రాధమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు.
ప్రాధమిక పాఠశాలల్లోని SGT లను 1:30 / 1:20 ప్రాతిపదికన 1,2 తరగతుల బోధనకు కేటాయిస్తారు
ప్రాధమిక పాఠశాలల్లోని జూనియర్ టీచర్ల ను 1,2 తరగతులు బోధించేందుకు వినియోగిస్తారు
ఎవరైనా సీనియర్ టీచర్ కు 3 నుండి 10 తరగతులు బోధించేందుకు తగిన అర్హత లేని యెడల...అట్టి అర్హత కలిగిన జూనియర్ టీచర్ ని ఉన్నత పాఠశాలకు పంపుతారు
తాను ప్రాధమిక పాఠశాలలో ఉండాలా లేక ఉన్నత పాఠశాలకు వెళ్లాలా... అనే ఐచ్చికం LFL HM కి ఇస్తారు. (ఏది ఏమైనప్పటికీ ఉన్నత పాఠశాలల్లో అవసరమగు విద్యార్హత కల్గిన ఉపాధ్యాయులు ఉండాలి)
ఉన్నత పాఠశాలల్లో సరిపడా స్థలం / గదులు లేనట్లయితే...3 నుండి 5 తరగతులు ప్రాధమిక పాఠశాలల్లోనే నడుపుతారు.
దీని కొరకు ప్రాధమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులే కాక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు కూడా పాఠ్య బోధన చేస్తారు.
ఒకవేళ 3 నుండి 10 తరగతులు బోధించేందుకు టీచర్ల లభ్యత కొరవడినట్లయితే ... జిల్లా లోని సర్ ప్లస్ ఉపాధ్యాయుల్ని పని సర్దుబాటు క్రింద నియమిస్తారు.
3 నుండి 10 తరగతులు బోధించు ఉపాధ్యాయులకు.. వారానికి 32 బోధనా పీరియడ్ల కంటే మించరాదు
సదరు విలీన ప్రక్రియ ది.31.10.2021 నాటికి పూర్తి కావలెను
ది.01.11.2021 జనననుండి నూతన విద్యా విధానం (5+3+3+4) అమలు కావలసి ఉంటుంది
ఇది ముసాయిదా మాత్రమే. దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
0 Comments:
Post a Comment