రూ. లక్షకు... అయిదేళ్లలో రూ. 34 లక్షలిచ్చింది...
హైదరాబాద్ : స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో మంచి గ్రోత్ ఉన్న కంపెనీలను ముందుగానే పసిగట్టడంలో ఆశిష్ కచోలియా దిట్ట. ఇటీవల ముగిసిన సెప్టెంబరు 2021 త్రైమాసికంలో ఆశిష్ కచోలియా తన పోర్ట్‌ఫోలియోకు క్వాలిటీ ఫార్మాస్యూటికల్స్ షేర్‌లను జోడించారు.
ఇది 2021 లో మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటి. వాస్తవానికి ఈ ఫార్మా స్టాక్ తన వాటాదారులకు అద్భుతమైన లాభాలనందిస్తోంది. అంతేకాదు... గత ఐదు సంవత్సరాల్తో ఈ స్టాక్ దాదాపు 3270 శాతం పెరిగింది. అలాంటివే ఈ క్వాలిటీ ఫార్మా షేర్స్. ఈ ఫార్మా స్టాక్ గత ఐదేళ్లలో ఒక్కో షేరుకు రూ. 25.80 నుంచి ఒక్కో స్థాయికి రూ. 870 కు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 34 రెట్లు పెరిగింది. అంటే ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెట్టి, అయిదేళ్ల పాటు కొనసాగించిపక్షంలో రూ. 34 లక్షలనందించింది.
ఆశిష్ కచోలియా విషయానికొస్తే, ప్రైమ్ సెక్యూరిటీస్‌లో ఆయన తన కెరీర్ ప్రారంభించారు. అలానే ఎడెల్వైజ్ ఈక్విటీ రీసెర్చ్ డెస్క్‌లో కొన్ని రోజుల పాటు పని చేశారు. తర్వాత 2003 లో లక్కీ సెక్యూరిటీస్ పేరుతో సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. బిర్లాసాఫ్ట్, మాస్టెక్, పాలీమెడిక్యూర్, అపోలో ట్రైకోట్ ట్యూబ్స్, ఫిలిప్స్ కార్బన్, కేప్లిన్ పాయింట్ వంటి సంస్థలలో మైనర్ వాటాలను కొనుగోలు చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియో తయారు చేసుకుని ఏస్ ఇన్వెస్టర్‌గా అద్భుతమైన లాభాలను గడించారు.
0 Comments:
Post a Comment