27% fitment in PRC report?
పీఆర్‌సీ నివేదికలో 27% ఫిట్‌మెంట్?
ఈనాడు, అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణకు సంబంధించి 11వ వేతన సవరణ కమిషన్ 27% ఫిట్‌మెంటును సిఫార్సు చేసిందా? అది అంతే మొత్తమని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు 11వ వేతన సవరణ కమిషన్ నివేదికను అమలు చేయాల్సి ఉంది. అశుతోష్ మిశ్ర ఏకసభ్య ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిషన్ గతేడాది అక్టోబరు 5న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వేతన సవరణ కమిషన్ నివేదిక సమర్పణ ఎంతో హడావుడిగా జరుగుతుంది. ముఖ్యమంత్రికి నేరుగా కమిషన్ తన నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో వారు విలేకర్లతోనూ మాట్లాడతారు. ఈ కమిషన్ కరోనా సమయంలో నివేదిక సమర్పించాల్సి వచ్చింది. దీంతో ఛైర్మన్ అశుతోష్ మిశ్ర రాకుండానే నివేదికను వారి కార్యాలయ ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపించారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఆ నివేదిక అందింది. ఇంతవరకూ ప్రభుత్వం నివేదికను బయటపెట్టలేదు. సాధారణంగా ఉద్యోగులకు ఎంత ఫిట్‌మెంట్ ఇస్తారనేది ఆసక్తికరం. వీలైనంత ఎక్కువ మొత్తం సాధించుకునేందుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చిస్తాయి.
0 Comments:
Post a Comment