25 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణ యించింది. ఈలోపు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఫీజుల ఖరారు, కళా శాలలకు అనుబంధ గుర్తింపు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ నెల 18న ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావే శంలో పూర్తి షెడ్యూలు నిర్ణయించనున్నారు. ప్రవేశాల కౌన్సెలింగ్పై గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వెబ్ పోర్టల్, ఆన్లైన్ ప్రవేశాలపైనా చర్చించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఫీజుల నిర్ణ యంపై యాజమాన్యాల అభిప్రాయాలను ఉన్నత విద్య నియంత్రణ, పర్య వేక్షణ కమిషన్ ఈ నెల 18 నుంచి స్వీకరించనుంది. యాజమాన్యాలు ఇప్పటికే ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించాయి. వీటి ఆధారంగా ఫీజు ఎంత అనేది కమిషన్ నిర్ణయిస్తుంది. అనంతరం ఫీజుల జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. 22లోపు ఫీజులు ఖరారు కానున్నాయి.
♦డిగ్రీ ప్రవేశాల ఐచ్ఛికాల నమోదుకు గడువు పొడిగింపు
డిగ్రీ ఆన్లైన్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీలో వెబ్ ఐచ్ఛికాల నమోదు గడు వును ఈ నెల 17 వరకు పొడిగించారు. దసరా పండుగను పురస్కరించు కొని గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. సహాయ కేంద్రాలను 15 నుంచి 17 వరకు మూసివేయను న్నామని, రెండో విడత ప్రవేశాలకు వీటిని పునఃప్రారంభిస్తామన్నారు.
0 Comments:
Post a Comment