✍మీ పిల్లల విద్యా సామర్థ్యం ఎంత?
♦పరీక్షించేలా నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్టు
♦ఈ నెల 23, 24 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు
మీ పిల్లల విద్యా సామర్థ్యం ఎంత? ఏయే అంశాలపై వారికి పట్టుంది. వారి విషయ పరిజ్ఞానం ఏమిటి? అనేది తెలుసుకుంటే..భవిష్యత్తులో వాళ్లు ఏ రంగంలో రాణిస్తారో ఇట్టే అంచనా వేయవచ్చు. ఈ లక్ష్యంతోనే జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) ప్రయోగాత్మకంగా ‘‘నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్టు(న్యాట్)-2021’’కు శ్రీకారం చుట్టింది. ఆన్‌లైన్‌లో జరిగే పరీక్ష రాసేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ‘‘ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. పరీక్షలో భాగంగా పలు రకాల నైపుణ్యాలను పరీక్షిస్తాం. గణాంకాలు, అనలిటికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ తదితర మొత్తం తొమ్మిది విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. 15-25 సంవత్సరాల వయసు విద్యార్థులు(8వ తరగతి, ఆపైన) పాల్గొనవచ్చు’ అని ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. విద్యార్థులు సాధించిన మార్కులపై నివేదిక కూడా ఇస్తామని తెలిపాయి. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.nat.nta.ac.in ను సంప్రదించాలని సూచించారు.
♦నాలుగు స్థాయులుగా విభజన
విద్యార్థుల వయసును బట్టి నాలుగు స్థాయిలుగా విభజించి పరీక్షలు నిర్వహిస్తారు. స్థాయి-1(13-15), స్థాయి-2(16-18), స్థాయి-3( 19-21), స్థాయి-4లో 22-25 సంవత్సరాల వారు పాల్గొనవచ్చు.
👉ఇదీ కాలపట్టిక👇
* రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సమర్పణ గడువు: 18వ తేదీ వరకు
* పరీక్ష తేదీ: స్థాయి-1, 2 అక్టోబరు 23న; స్థాయి-3,4 24న
* సమయం: 2 గంటలు(ఉదయం 11 నుంచి 1 గంట వరకు, సాయంత్రం: 4-6 గంటల వరకు)
* మార్కులు: 90 ప్రశ్నలు...90 మార్కులు)
0 Comments:
Post a Comment