ఉపాధ్యాయ సెలవులపై స్పష్టత..
ఉపాధ్యాయుల సెలవుల కుదింపు వార్తపై పాఠశాల విద్యశాఖ ఉన్నతాధికారులను యూనియన్ నాయకులు సంప్రదించగా - సెలవులపై ఎటువంటి ఉత్తర్వులు జారీ కాలేదని తెలిపారు..
నేడు వార్త పత్రికలో ప్రచురించిన ఉపాధ్యాయ సెలవుల కుదింపు వార్తపై స్పష్టత కోసం, రాష్ట్ర నాయకులు పాఠశాల విద్య శాఖ ఉన్నత అధికారులతో మాట్లాడారు..
ఉపాధ్యాయుల సెలవుల విషయమై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని , ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు మరియు OH లను పాఠశాల వారీ కాకుండా వ్యక్తిగతంగా వాడుకోవాలని సూచించారు..,
పాఠశాలకు పని దినాలు తగ్గినందున ఆప్షనల్ హాలిడే వల్ల పాఠశాల మూతపడకుండ ఉపాధ్యాయుల అవసరం మేరకు వాడుకోవాలని సూచించినట్టు తెలిపారు..
ఉపాధ్యాయుల వాదన ఇలా ఉంది...
2021 జనవరి నుంచి ఉపాధ్యాయులు పాఠశాల కు వెళ్తూనే ఉన్నారు...ఫిబ్రవరి లో పిల్లలు కూడా హాజరు అయ్యారు...
మార్చి ,ఏప్రిల్ కూడా విద్యార్థులు తోనే పాఠశాలలు జరిగాయి...
వేసవి సెలవులు అనంతరం ఉపాధ్యాయులు 50 % వంతున జూన్ జులై మాసంలో హాజరు అయ్యారు...ఆగస్ట్ లో పిల్లలు కూడా వస్తున్నారు..కావున ఈ విధం గా సెలవులు కుదింపు సమంజసం కాదని ఉపాధ్యాయులు చర్చలు చెనుకుంటున్నారు...
ఈనాడు, అమరావతి:
💁♀️ఉపాధ్యాయుల సెలవుల కుదింపు..
పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయుల సెలవులను తగ్గించింది. కరోనా కారణంగా పనిదినాలు తగ్గించినందున అదే నిష్పత్తిలో సాధారణ సెలవులను కుదించింది.
ఉపాధ్యాయులకు 12 నెలలకు 22 సెలవుల లెక్కన ఆగస్టు నుంచి డిసెంబరుకు తొమ్మిది,
ఉపాధ్యాయినులకు 27 సెలవుల లెక్కన 11 సాధారణ సెలవులు ఇవ్వనున్నారు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం నిలిపివేత.
🔮ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ రద్దుచేసింది. కరోనా కారణంగా అవార్డుల ప్రదానాన్ని ఈ ఏడాది నిలిపివేసింది. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకోవాలని, ప్రతిపాదనలు కమిషనరేట్‌కు పంపించాలని ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు అవార్డుల కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించట్లేదు.`
.
0 Comments:
Post a Comment