SBI Gold Loan: ఎస్బీఐలో గోల్డ్ లోన్ ఆఫర్... వడ్డీ రేటుపై భారీ డిస్కౌంట్
1. కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని (Financial Crisis) సృష్టించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు, వ్యాపారులు, అన్ని వర్గాలవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి బంగారాన్ని తాకట్టు (Gold Loan) పెడుతున్నారు. దీంతో గోల్డ్ లోన్ తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది.
2. గోల్డ్ లోన్ తీసుకునేవారికి బ్యాంకులు లాభదాయకమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. గోల్డ్ లోన్ (Gold Loan) వడ్డీ రేట్లపై డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) గోల్డ్ లోన్ వడ్డీ రేటుపై డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థల్లో గోల్డ్ లోన్ (Gold Loan) వడ్డీ రేట్లు 7 శాతం నుంచి 29 శాతం మధ్య ఉంటాయి. ఎస్బీఐలో గోల్డ్ లోన్‌పై ప్రస్తుతం 7.50 శాతం వడ్డీ రేటు ఉంది.
3. యోనో ఎస్బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా చాలా సింపుల్‌గా గోల్డ్ లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు. పేపర్ వర్క్ చాలా తక్కువ. ప్రాసెసింగ్ సమయం కూడా తక్కువే. యోనో ఎస్బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా అప్లై చేసిన తర్వాత బ్రాంచ్‌లో ఎక్కువ సమయం ఉండాల్సిన అవసరం లేదు.
4. యోనో ఎస్బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా గోల్డ్ లోన్‌కు దరఖాస్తు చేస్తే 0.75 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ 2021 సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ ఉంది. కేవలం 4 స్టెప్స్‌లో గోల్డ్ లోన్‌కు అప్లై చేయొచ్చు. మరి యోనో ఎస్బీఐ వెబ్సైట్ లేదా యాప్‌లో పసిడి రుణాలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
5. యోనో ఎస్బీఐ ద్వారా గోల్డ్ లోన్‌కు దరఖాస్తు చేయండానికి ముందుగా యోనో ఎస్బీఐ వెబ్సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి. అకౌంట్ వివరాలతో లాగిన్ కావాలి.
హోమ్ పేజీలో త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాలి. Loans పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Gold Loan సెలెక్ట్ చేయాలి.
6. Apply Now పైన క్లిక్ యాలి. ఆ తర్వాత నగల వివరాలను ఎంటర్ చేయాలి. నగ టైప్, బరువు, క్యారట లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. వృత్తి, ఆదాయం, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
7. ఆ తర్వాత బ్రాంచ్‌కు వెళ్లి మీ నగలను ఇవ్వాల్సి ఉంటుంది. రెండు ఫోటోలు, కేవైసీ డాక్యుమెంట్స్ తప్పనిసరి. డాక్యుమెంట్స్ పైన సంతకం చేసి ఇచ్చిన తర్వాత లోన్ అప్రూవ్ అవుతుంది.
8. ఎస్బీఐలో గోల్డ్ లోన్‌కు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. వయస్సు 18 ఏళ్ల పైనే ఉండాలి. ఆదాయానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలి. పెన్షనర్లకు ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు.
9. కనీసం రూ.20,000 నుంచి రూ.50,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. 36 నెలల్లోపు రుణాలు తిరిగి చెల్లించొచ్చు. బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఎంచుకుంటే 12 నెలల్లో చెల్లించాలి. ఫోర్ క్లోజర్, ప్రీ-పేమెంట్ ఛార్జీలు ఉండవు.
0 Comments:
Post a Comment