✍ఆర్జీయూకేటీ సెట్-2021కి 74 వేలు దాటిన దరఖాస్తులు
♦రూ.1,000 ఫైన్‌తో ఈ నెల 11 వరకు గడువు
🌻నూజివీడు:
రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహి ఆర్జీయూకేటీ సెట్-2021కి మంగళవారం నాటికి 74,088 దరఖాస్తులు వచ్చాయి. ఇడుపులపాయ, నూజివీడ శ్రీకాకుళం ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4 వేల సీట్లు ఉండగా. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. రూ.1,000 ఫైన్‌తో ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుండటంతో మరిన్ని దరఖాస్తులు వస్తాయని ఆర్జీయూకేటీ అధికారులు భావిస్తున్నారు. అత్యధికంగా వైఎస్సార్ జిల్లా నుంచి 8,778 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి కేవలం 2,992 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,328 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈ నెల 26న నిర్వహించనున్న పరీక్షకు 18వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Last year applications
ReplyDelete