Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Friday, 24 September 2021

RBI Scholarship: ఆర్‌బీఐ నుంచి నెలకు రూ.40,000 స్కాలర్‌షిప్... అప్లై చేయండి ఇలా

 RBI Scholarship: ఆర్‌బీఐ నుంచి నెలకు రూ.40,000 స్కాలర్‌షిప్... అప్లై చేయండి ఇలా...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్కాలర్‌షిప్ స్కీమ్ (Scholarship Scheme) ప్రకటించింది.
నెలకు రూ.40,000 చొప్పున మూడు నెలల పాటు స్కాలర్‌షిప్స్ అందించనుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) లేదా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా కాలేజీల్లో ఫైనాన్స్ లేదా ఎకనమిక్స్ బోధిస్తున్న ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ స్కాలర్‌షిప్స్ (Scholarship) పొందొచ్చు. మొత్తం 5 స్కాలర్‌షిప్స్ ప్రకటించింది ఆర్‌బీఐ. ద్రవ్య, ఆర్థిక శాస్త్రం లాంటి అంశాల్లో షార్ట్ టర్మ్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారు తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచే ప్రాజెక్ట్ పూర్తవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్‌బీఐ సెంట్రల్ ఆఫీస్ లేదా రీజనల్ ఆఫీస్‌లో కొంతకాలం పరిశోధన చేయాల్సి ఉంటుంది. స్కాలర్‌షిప్‌తో పాటు రీసెర్చ్ పేపర్ విజయవంతంగా పూర్తి చేసినవారికి రూ.1,50,000 పారితోషికం కూడా లభిస్తుంది.

ఆర్‌బీఐ ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్ ఫామ్‌ను పోస్టులో పంపాలి. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 20 చివరి తేదీ. దరఖాస్తు ఫామ్ ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకోండి.
RBI Scholarship Scheme 2021: ఆర్‌బీఐ స్కాలర్‌షిప్ వివరాలివే...


స్కాలర్‌షిప్స్ సంఖ్య- 5

ప్రాజెక్ట్ కాలం- గరిష్టంగా మూడు నెలలు

స్కాలర్‌షిప్- నెలకు రూ.40,000 చొప్పున మూడు నెలలు లభిస్తుంది.

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 20

స్కాలర్‌షిప్ స్కీమ్ ప్రారంభం- 2021 డిసెంబర్ 6

అర్హతలు- ఫైనాన్స్ లేదా ఎకనమిక్స్ బోధిస్తున్న ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దరఖాస్తు చేయాలి.

వయస్సు- 55 ఏళ్ల లోపు

ఈ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
RBI Scholarship Scheme 2021: ఆర్‌బీఐ స్కాలర్‌షిప్ వివరాలివే...


Step 1- అభ్యర్థులు https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్స్‌లో Scholarships పైన క్లిక్ చేయాలి.

Step 2- Scholarship Scheme for Faculty Members from Academic Institutions: 2021 పైన క్లిక్ చేయాలి.

Step 3- Application పైన క్లిక్ చేస్తే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.

Step 4- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

Step 5- పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్ నింపాలి.

Step 6- రీసెర్చ్ ప్రపోజల్‌తో 1,000 కన్నా ఎక్కువ పదాలతో కరిక్యులమ్ విటే రూపొందించాలి.

Step 7- ప్రస్తుతం ఫ్యాకల్టీగా పనిచేస్తున్న యూనివర్సిటీ లేదా కాలేజ్ అఫీషియల్ లెటర్ జత చేయాలి.

Step 8- దరఖాస్తు ఫామ్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Director, Development Research Group,
Department of Economic and Policy Research,
7th Floor, Central Office Building,
Reserve Bank of India, Fort, Mumbai - 400001


0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top