Notices to 1867 HMs
The reason is negligence on lunch ..
1867 మంది హెచ్ఎంలకు నోటీసులు
మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యమే కారణం..
అనంతపురం
జిల్లా వ్యాప్తంగా 1867 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్న భోజనం, టీఎంఎ్ఫపై నిర్లక్ష్యం చూపిన హెచ్ఎంలకు జేసీ సిరి ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఇన్చార్జ్ డీఈఓ రంగస్వామి నోటీసులు ఇచ్చారు. జిల్లాలోని 1867 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకం, టీఎంఎ్ఫపై ఐఎంఎంఎస్ యాప్లో స్పందించకపోవడంతో ఆన్లైన్ రిపోర్ట్ తీసి, వారిపై చర్యలకు ఉపక్రమించారు. 3 రోజుల్లో ప్రధానోపాధ్యాయులు సంబంధిత డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓల ద్వారా సంజాయిషీ ఇవ్వాలని డీఈఓ ఆదేశించారు. షోకాజ్ నోటీసుకు స్పందించకపోతే.. చర్యలు తప్పవని హెచ్చరించారు.
0 Comments:
Post a Comment