EPFO New Rules Implements From September First
పీఎఫ్ రూల్స్ మారిపోతున్నాయ్.. కొత్త రూల్స్ ఇవే
ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల్లో కేంద్రం పలు మార్పులు చేసింది. పలు కంపెనీల్లో పనిచేసే వారికి ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ తో పాటు కంపెనీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది.
పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బులకు ఇతర పొదుపు సంస్థల కంటే ఎక్కువ అంటే.. 8.5 శాతం వడ్డీరేటు అందిస్తోంది పీఎఫ్ సంస్థ. అయితే.. ఇప్పటి ఉన్న రూల్స్ మారిపోయాయి. నేటి నుంచి ఈపీఎఫ్ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. పీఎఫ్ ఖాతాలు ఉన్నవారు తమ ఖాతాను ఆధార్ తో లింక్ చేయకపోతే.. ఇకపై పీఎఫ్ ఖాతాలో కంపెనీ వాటా నిలిపివేయబడుతోంది. కొన్ని నెలల క్రితం పీఎఫ్ ఖాతాను.. ఆధార్ కార్డుతో లింక్ చేయడంపై కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. 2021 సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్ రూల్ మారబోతోంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఆధార్ నెంబరుతో పీఎఫ్ ఖాతాకు ఆగష్టు 31 లోపు లింక్ చేయాలి.
ఈపీఎఫ్ ఖాతాకు వారి ఆధార్‌తో లింక్ చేయబడని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో యజమాని వాటా ఈరోజు నుంచి నిలిపివేయబడుతుంది. యూఏఎన్ ఆధార్ ధృవీకరించబడకపోతే దాని ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ఈసీఆర్) తీసుకోదు. అంటే.. ఉద్యోగులు వారి స్వంత పీఎఫ్ ఖాతాను చూడగలిగినప్పటికీ.. కంపెనీ వాటాను పొందలేరు. ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటర్ కూడా అన్ని ఈపీఎఫ్ ఖాతాదారుల యూనివర్సనల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ఆధార్ ధృవీకరించబడాలని యజమానులను ఆదేశించింది. ఈపీఎఫ్‌లో ఉద్యోగికి కోవిడ్ – 19 అడ్వాన్స్ తీసుకోవడం, పీఎఫ్ బీమా, ఇతర పొదుపు పథకాల కన్నా అధిక వడ్డీ రేటు పొందడం వంటి అనేక ప్రయోజనాలు, ఉపయోగాలున్న విషయం తెలిసిందే.
ఈపీఎఫ్ – ఆధార్ లింక్ ఎలా చేయాలంటే..
– పీఎఫ్ సభ్యుల పోర్టల్‌లో మీ ఈపీఎఫ్ ఖాతాకు లాగిన్ అవ్వండి.
– మీ యూఏఎన్ ఆధార్ లో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
– జనరేట్ ఓటీపీ ఎంపికపై క్లిక్ చేయండి.
– ఓటిపీని పూర్తిచేసి జెండర్ (లింగాన్ని) ఎంచుకోండి.
– ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆధార్ వెరిఫికేషన్‌ను సెలక్ట్ చేసుకోండి.
– మొబైల్, ఈ-మెయిల్ ఆధారిత ధృవీకరణ ఎంపికను ఎంచుకోండి.
– ఇప్పుడు మీ మొబైల్ నంబర్‌కు ఇంకో ఓటీపీ వస్తుంది.
– రెండో ఓటీపీని ఎంటర్ చేయండి.
– మీ ఈపీఎఫ్, యూఏఎన్ ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేయండి.
0 Comments:
Post a Comment