Microsoft Internship: డిగ్రీ చదువుతున్నారా? ఐటీ ఉద్యోగమే లక్ష్యమా? మీకే ఈ గుడ్ న్యూస్..
ఐటీ రంగం (IT Sector)పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ (Microsoft) ఒక డ్రీమ్ కంపెనీ.
ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీల్లో ఇది ఒకటి. ఈ సంస్థ ఐటీ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (Virtual Internship Program)ను ప్రారంభించింది. ఫ్యూచర్ రెడీ టాలెంట్ (Future ready talent) ప్రోగ్రామ్ పేరుతో మైక్రోసాఫ్ట్ ఈ వర్చువల్ ఇంటర్న్‌షిప్ తీసుకొచ్చింది. డిగ్రీ రెండో సంవత్సరం, ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. 2022 నుంచి 2024 వరకు ఐటీ కంపెనీలలో చేరబోయే సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులకు.. ఉద్యోగంలో అవసరమయ్యే స్కిల్స్ నేర్పించడానికి ఇంటర్న్‌షిప్‌ను డిజైన్ చేశారు.
ఏఐసీటీఈ, నాస్ కామ్, ఈవై, గిట్ హబ్, క్వెస్ కార్ప్ లాంటి సంస్థలు మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కానున్నాయి. ఆయా సంస్థలకు చెందిన ట్రెయినర్స్ ఈ ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. 'యువతలో ఉన్న టాలెంట్‌ను బయటికి తీయడానికి, వాళ్ల కెరీర్‌కు ఉపయోగపడే సరైన స్కిల్స్‌ను అందించడం కోసం ఈ ప్రోగ్రాంను ప్రారంభించాం. వరల్డ్ క్లాస్ సంస్థలతో ఒప్పందం చేసుకొని విద్యార్థులకు నాణ్యమైన ట్రెయినింగ్ ఇచ్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం' అని తెలిపారు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి.
ఈ ప్రోగ్రామ్ ద్వారా స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటర్న్ షిప్‌కు సంబంధించిన సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, ఏఐ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపై ఈ ప్రోగ్రామ్ లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ- 2020 ప్రకారం, ఏఐసీటీఈ ఈ కోర్సు కరిక్యులమ్ సిద్ధం చేసింది. ఎస్ఎస్సీ నాస్ కామ్.. విద్యార్థులకు ఇతర కోర్సులను అందుబాటులో ఉంచుతుంది.
ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) సంస్థ ఇంటర్న్ షిప్ సమయంలో ఇండస్ట్రీ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తుంది. గిట్ హబ్ ద్వారా డెవలపర్ టూల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇతర ప్రాజెక్టులను కూడా అందులో యాక్సెస్ చేసుకోవచ్చు. క్వెస్ కార్ప్.. లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్, వర్చువల్ కెరీర్ ప్లాట్ ఫామ్ ను అందిస్తుంది.
'విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించేందుకు, కెరీర్‌కు కావాల్సిన ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను అందించేందుకే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని రూపొందించారు. దానిలో భాగంగానే.. మైక్రోసాఫ్ట్ తో చేతులు కలిపి. ఫ్యూచర్ రెడీ టాలెంట్ ప్రోగ్రామ్ ను విద్యార్థుల కోసం అందిస్తున్నాం' అని చెప్పారు ఏఐసీటీఈ చైర్మన్ డాక్టర్ అనిల్ సహస్రాబ్ధి.
ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ లో చేరాలనుకునే విద్యార్థులు.. https://futurereadytalent.in/index అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి బ్యాచ్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కోసం.. సెప్టెంబర్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.
0 Comments:
Post a Comment