ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ( APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలా మారింది.
పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్ఎస్డీసీ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. అన్ని రకాల విద్యార్హతలు కలిగిన వారికి తగిన విధంగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోంది. Flipkart, Amazon, Jio, Airtel, Amara Raja, KIA Motors, Heroతో పాటు అనేక ప్రముఖ సంస్థల్లో ఖాళీల భర్తీకి APSSDC నుంచి ప్రకటనలు విడుదల అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో జాబ్ మేళాలను సైతం APSSDC నిర్వహిస్తోంది. తాజాగా మరో జాబ్ మేళాను ప్రకటించింది. More Retail India, Airtel Xstram, Rising Stars Hi Tech Pvt Ltd (LED TV Project), Hero Motor Corp తదితర సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాను సెప్టెంబర్ 3న నిర్వహించనున్నారు. అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
0 Comments:
Post a Comment