ఎట్టకేలకు జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల
అభ్యంతరాల స్వీకరణకు గడువు ఒకటిన్నర రోజే
🌻ఈనాడు, న్యూస్:
ఎట్టకేలకు జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షల ప్రాథమిక కీని జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. పేపర్ లీకు కుంభకోణం నేపథ్యంలో గతానికి భిన్నంగా ఈసారి పరీక్షలు ముగిసిన తర్వాత నాలుగో రోజు కీని విడుదల చేసింది. వాటిపై అభ్యంతరాలను తెలిపేందుకు ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటల వరకు...అంటే కేవలం ఒకటిన్నర రోజే గడువు ఇవ్వడం గమనార్హం. ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిన మొత్తం 2.50 లక్షల మంది ఈ నెల 11వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఐఐటీ ఖరగ్పూర్ ఇప్పటికే ప్రకటించింది. అంటే జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 10వ తేదీలోపు వెల్లడి కావాల్సి ఉంది.
0 Comments:
Post a Comment