IT returns:Extension of deadline for filing of IT returns
ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు
దిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరట కల్పించింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును పెంచింది. 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ గురువారం ప్రకటించింది. కరోనా వైరస్‌తో నెలకొన్న పరిస్థితుల కారణంగా గతంలో సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, ఐటీ రిటర్నుల దాఖలు కోసం ఇన్ఫోసిస్ సంస్థ రూపొందించిన కొత్త వెబ్సైట్లో సాంకేతికత సమస్యల పరిష్కారం కొలిక్కిరాని నేపథ్యంలో సెప్టెంబరు 30 వరకు ఉన్న ఈ గడువును డిసెంబర్ 31 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
*ఈ ఏడాది జూన్ 7న ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్సైట్ ( www.incometax.gov.in)ను ఇన్ఫోసిస్ సాంకేతిక సహకారంతో అందుబాటులోకి తీసుకురాగా.. అప్పటి నుంచి సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే* ఉన్నాయి.
*దీంతో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించిన చేసిన ఇన్ఫోసిస్‌కు కేంద్రం డెడ్‌లైన్ విధించింది.* ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సలీల్ పరేఖ్ భేటీ సందర్భంగా ఈ గడువు నిర్దేశించారు. *సెప్టెంబర్ 15లోగా పోర్టల్‌కు సంబంధించిన లోపాలను సవరించాలని కేంద్రం సూచించింది.* పోర్టల్ అందుబాటులోకి వచ్చిన రెండు నెలల దాటినా సమస్యలు ఉత్పన్నమవుతుండడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు.
0 Comments:
Post a Comment