సివిల్ సర్విసెస్ టెస్టును ఓ యువకుడు 22ఏళ్ల వయసులోనే క్రాక్ చేశాడు. చిన్న వయసులోనే జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం ఆ జాబ్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు.
ప్రస్తుతం 14వేల కోట్ల విలువైన కంపెనీకి సహవ్యవస్థాపకుడిగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం ప్రిపేరయ్యే వేలాది మంది పేద అభ్యర్థులకు తన వంతుసాయం అందిస్తున్నాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన రోమన్ సైని చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేవారు.
అతని ప్రతిభాపాటవాలతో అందరిని అశ్యర్యపరిచేవారు. ఈ క్రమంలోనే 16ఏళ్ల వయసులో ఎయిమ్స్ అడ్మిషన్ ఎగ్జామ్‌లో విజయం సాధించారు. 18ఏళ్ల వయసులో రోమన్ సైని.. ఓ అంశంపై రీసెర్చ్ పూర్తి చేశాడు.
అందుకు సంబంధించిన పత్రాలు ప్రఖ్యాత మెడికల్ పబ్లికేషన్‌లో అప్పట్లో ప్రచురితం అయ్యాయి. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఈయన.. నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్(ఎన్‌డీడీటీఎస్)లో కొంతకాలం పని చేశారు.
ఆయన దృష్టి సివిల్ సర్వీసెస్పైకి మల్లడంతో కేవలం ఆరు నెలల్లోనే తాను చేస్తున్న ఉద్యోగానికి రోమన్ సైని రాజీనామా చేశారు. 22ఏళ్ల వయసులో దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ టెస్టును రోమన్ సైని క్రాక్ చేశారు.
ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన ఆయన తాను ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలో హర్యానాలోని మారుమూల గ్రామాల్లో పర్యటించినట్టు చెప్పారు.
ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి, సివిల్ సర్వీస్ ద్వారా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. కాగా శిక్షణను పూర్తి చేసుకున్న రోమన్ సైని చిన్న వయసులోనే మధ్యప్రదేశ్‌లో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
దేశంలోనే కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పిన్నవయస్కులలో ఒకరిగా గుర్తింపు పొందినప్పటికీ అది రోమన్ సైనికి సంతృప్తినివ్వలేదు. దీంతో కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని వదులుకున్నారు.
అనంతరం తన స్నేహితులతో కలిసి అనకాడమీ అనే ఆన్లైన్ శిక్షణా సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం ఇందులో దాదాపు 18వేల ట్యూటర్లు పని చేస్తుండగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఇందులో కోచింగ్ తీసుకుంటున్నారు.
యూపీఎస్పీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన క్లాసులు కూడా ఇందులో అందుబాటులో ఉండటంతో మధ్య, పేద వర్గాలకు చెందిన అభ్యర్థులు అనకాడమీ ద్వారా లబ్ధి పొందుతున్నారు. కాగా ప్రస్తుతం అనకాడమీ కంపెనీ విలువ ప్రస్తుతం 14,830కోట్ల వరకు ఉంది.
0 Comments:
Post a Comment