If we have too much sugar in our body .. will we lose our eyesight? Experts say yes to the question.
There is also a risk of eventually losing sight of it if taken carelessly.
Actually, corona time. Changing variants, as well as haunting health issues.
No matter how careless these are .. a situation where lives are lost.
That is why some experts are making some suggestions on physical disorders. If we follow them and make changes in our lifestyle .. there will be no risk. Let us know those details.
Most patients with diabetes have blurred vision. They complain that they are unable to read even a small document.
Some people think that this situation has arisen due to increasing age.
మన శరీరంలో షుగర్ ఎక్కువైతే.. కంటిచూపును కోల్పోతామా? అనే ప్రశ్నకు నిపుణులు ..అవుననే చెబుతున్నారు. దీన్ని అజాగ్రత్తగా తీసుకుంటే చివరికి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు.
అసలే, కరోనా సమయం. మారుతున్న వేరియంట్లు, దానికితోడు వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు. వీటిపై ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి.
అందుకే కొంతమంది నిపుణులు శారీరక రుగ్మతలపై కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిని అనుసరించి మన జీవన శైలిలో మార్పులు చేసుకుంటేనే.. ఏ ప్రమాదం ఉండదు. ఆ వివరాలు తెలుసుకుందాం.
డయాబెటీస్ (Diabetes) రోగుల్లో చాలామందికి కంటిచూపు స్పష్టంగా ఉండదు. వారు చిన్న పత్రాన్ని కూడా చదవలేకపోతున్నామని ఆవేధన వ్యక్తం చేస్తారు. దీని అంతగా పట్టించుకోకుండా.. వయస్సు పెరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడిందని భావిస్తారు కొందరు.
దానికి అసలు కారణం తెలుసుకోవాలని ప్రయత్నించరు. దీన్ని ఇలాగే వదిలిస్తే.. చివరికి కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
కంటి సంబంధిత వ్యాధులు డయాబెటీస్‌ను అదుపులో పెట్టుకోకపోవడం వల్ల వస్తుంది. ఇది కంట్లో వెనుకవైపు భాగంలో ఉండే రెటీనాలో ఉన్న కాంతిలో ఉండే.. సున్నితమైన కణజాలానికి సరఫరా చేసే రక్తనాళాల (Blood cells) ను దెబ్బతీస్తుంది.
అందుకే డయాబెటీస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం.
డయాబెటిక్ 'ఐ' అంటే...
డయాబెటిక్ ఐ (Diabetic eye) అంటే... డయాబెటీస్ వల్ల ఆ కన్ను తరచూ ప్రభావానికి లోనవుతుంది. అది డయాబెటిక్ రెటినోపతికి దారితీస్తుంది. అంతేకాదు, డయాబెటిక్ మాక్యూలర్ ఎడెమా, క్యాటరాక్ట్స్, గ్లూకోమాకు కూడా కారణమతుంది.
షుగర్‌ను నియంత్రించకపోతే కళ్లను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.
బ్లరీ విజన్(Blur vision) , రంగులను గుర్తుపట్టకపోవడం, రాత్రుల్లో చూపు అస్సలు కనిపించకపోవడం వంటికి కారణమవుతాయి. కానీ, కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని అదుపు చేయవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
రక్తంలో ఉండే గ్లూకోజ్‌ను నియంత్రనలో ఉంచుకోవడం.
ముఖ్యంగా పొగతాగడం మానివేయాలి.
ప్రతిరోజూ ఎక్సర్సైజ్ చేయాలి చేయడం అలవాటు చేసుకోవాలి.
త.రచూ షుగర్ పరీక్ష చేసుకోవడం, గ్లూకోజ్ లెవల్‌ను అదుపులో ఉంచుకోవడం, అప్తామాలజీస్ట్ను అప్పుడప్పుడు కలిసి కళ్లను చెక్ చేయించుకోవడం వంటివి చేయాలి
ఏడాదికి కనీసం ఒక్కసారి అయిన కంటి పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. అప్పుడే, చూపు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
ఆకుకూరాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం.
వీటిన్నిటితో డయాబెటీస్ వల్ల మీ చూపునకు ఏ ప్రమాదం ఉండదు.
0 Comments:
Post a Comment