బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చిన హైకోర్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్ట్ లో వరుసగా షాక్ లు తగులుతున్నాయి. తాజాగా మరో షాక్ తగిలింది. రాజధాని లో అక్రమాలు అంటూ గత ఏడాది సెప్టెంబర్ లో ప్రభుత్వం కేసు నమోదు చేసింది.
అప్పటి అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ తో పాటుగా 14 మంది పై కేసు నమోదు చేసింది. గతం లోనే ఈ కేసుపై హైకోర్ట్ స్టే ఇవ్వడంతో సుప్రీం కోర్ట్ వెళ్లి సవాల్ చేసింది ఏపీ సర్కార్. కేసు విచారణ జరిగే సమయం లో అప్పీల్ ఉపసంహరించుకున్నది ప్రభుత్వం.
అంతకు ముందే ఇంసైడర్ ట్రేడింగ్ ఆరోపణలను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. దమ్మాలపాటి సహా ఇతరులపై కేసును నెల రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ఏపీ హైకోర్ట్ ను సుప్రీం ఆదేశించింది. ఆగస్టు 19న విచారణ పూర్తి చేసింది. నేడు తీర్పు వెల్లడించి... దమ్మాల పాటి తో పాటు ఇతరులపై పెట్టిన కేసులను కొట్టేసింది. మానసిక క్షోభ కలిగించినందుకు చట్టపరంగా చర్యలు తప్పవని హైకోర్టు సూచించింది.
0 Comments:
Post a Comment