సీఎస్ గా సమీర్ శర్మ
నేడు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల స్వీకారం
🌻అమరావతి, ఆంధ్రప్రభ:
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు సీఎస్ గా బాధ్యతలు వహిస్తున్న ఆధిత్యానాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్నారు. ఆదిత్యానాథ్ దాస్ పదవీ విరమణ అనం తరం కేబినెట్ హోదాలో ఢిల్లీలో ముఖ్య కార్యదర్శి బాధ్యతలు స్వీకరించనున్నారు. 37 సంవత్సరాల అనుభవం గల సమీర్ శర్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో సీఎం డీగా వ్యవహరించారు. కేంద్ర సర్వీసులతో పాటు అంతర్జాతీయంగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్‌గా పేరొందిన హైదరాబాద్, విశాఖ, విజయవాడ మూడింటికి కమిషనర్ గా పనిచేసిన ఏకైక ఐఏఎస్ అధికారి కావడం విశేషం. అలాగే భారత పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా పనిచేసినప్పుడు రూపొందించిన బ్యాలెన్స్ కోర్ కార్డ్ పద్ధతి వల్ల ఆ సంస్థ ఆదాయం 30 శాతం పెరి గింది. ఆయన కేంద్ర సర్వీసుల్లో స్మార్ట్ సిటీస్ మిషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల డీజీగా పనిచేస్తూ తిరిగి ఏపీకి వచ్చారు. ఎక్కువ కాలం మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్లోనే ఆయన పనిచేశారు. 37 ఏళ్ల సర్వీసులో అనేక హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. సుమారు 7 ఏళ్లుగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను ఏపీ ప్రభుత్వం ఇటీవలె రాష్ట్రానికి తీసుకువచ్చి సీఎస్‌గా నియమిం చింది. కాగా ఇప్పటి వరకు సీఎస్ గా వ్యవహరించి పదవీ విరమణ చేస్తున్న 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఆధిత్యానాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్నారు. గతేడాది డిసెంబర్ 31న ఆధిత్యానాథ్ దాస్ సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూన్‌తో ఆయన పదవీ కాలం ముగియగా.. రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. గురువారంతో ఆయన పదవీ కాలం ముగియనుండటంతో నూతన సీఎస్ గా నియామకమైన సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదిత్యానాథ్ దాసు ఘనంగా వీడ్కోలు పలికేందుకు అధికారులు, సచివాలయ ఉద్యోగులు భారీ ఏర్పాట్లు చేశారు.
0 Comments:
Post a Comment