ఎపి పాలిసెట్-2021 ఫలితాల్లో నిడమర్రు జెడ్పి హైస్కూల్ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు వై.శేషగిరిరావు తెలిపారు.
పుల్లా నాగహరతికి 120కు 113 మార్కులతో 37వ ర్యాంకు సాధించింది. పానకాల కుసుమశ్రీ నాగసాహితీ ప్రియకు 215వ ర్యాంకు, పుల్లా రేవతి 1007వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచే ప్రభుత్వ స్కూళ్లలో విద్యనభ్యసించడం విశేషం. పైగా వీరంతా ఉపాధ్యాయుల పిల్లలే. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వీరిని గ్రామ సర్పంచి పి.ఉమా మహేశ్వరరావు, స్కూల్ విద్యా కమిటీ ఛైర్మన్ అంబళ్ల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు.
భీమవరం రూరల్:రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పాలిసెట్ ఫలితాలలో భీమవరం తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఆ విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీనున్న తిరుమలరావు తెలిపారు. కళాశాలకు చెందిన బి. హర్ష చంద్ర స్టేట్ 19వ ర్యాంకు, జిఎస్ఎం.ప్రణవీ 36వ ర్యాంకు, పి. నవ్యశ్రీ 42వ ర్యాంకు, జి.మహతి 68వ ర్యాంకు, ఎ.తనూష 88వ ర్యాంకు సాధించారన్నారు. కేవలం 40 మంది పరీక్షకు హాజరు కాగా అందులో స్టేట్ 50లోపు ముగ్గురు, వందలోపు ఐదుగురు, 200లోపు పది మంది, 500లోపు 14 మంది, వెయ్యిలోపు 20 మంది ర్యాంకులు సాధించారని సంస్థ డైరెక్టర్లు ఎస్.సాయిరాజు, పి.శ్రీనివాసవర్మ, జి.సతీష్‌బాబు తెలిపారు. ఈ ఫలితాలను సాధించిన విద్యార్థు లకు, ఉపాధ్యాయులకు అభినందనలు, సహకరించిన తల్లిదండ్రులకు, ధన్యవాదాలు తెలిపారు.
పాలకొల్లు ఆదిత్య విద్యార్థికి 31వ ర్యాంకు
పాలకొల్లు: పాలకొల్లు ఆదిత్య విద్యార్థికి పాలిసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 31వ ర్యాంకు లభించింది. తమ విద్యార్థుల్లో ఐదుగురికి 500ల్లోపు ర్యాంకులు వచ్చినట్లు ఆదిత్య విద్యాసంస్థ డైరెక్టర్ ఎస్వి.రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వై.లక్ష్మీ అమృత 120 మార్కులకు 118 మార్కులతో రాష్ట్రస్థాయి 31వ ర్యాంకు, బి.శ్రీరామ్ నిశ్చరుకు 352వ ర్యాంకు, టి.గగన తేజస్వినికి 419వ ర్యాంకు, ఎల్.లక్ష్మీ నారాయణతేజకు 436వ ర్యాంకు, సిహెచ్. నాగసాయి లలితాదేవికి 459వ ర్యాంకు లభించిందని తెలిపారు. విద్యార్ధులను, శిక్షణ ఇచ్చిన అధ్యాపక బృందాన్ని విద్యాసంస్థల ఛైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ రాఘవరెడ్డి, ప్రిన్సిపల్ అయ్యప్పరాజు అభినందించారు.
0 Comments:
Post a Comment