✍కళాశాలలను ఇవ్వం.. సిబ్బందినే ఇస్తాం!
♦మెజారిటీ ఎయిడెడ్ కళాశాలల నిర్ణయం
🌻ఈనాడు, అమరావతి:
రాష్ట్రంలోని 88 శాతం ఎయి డెడ్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సిబ్బందిని మాత్రమే వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించాయి. మరో 8శాతం కళాశాలలు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం వెల్ల డించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 137 ఎయిడెడ్ కళాశా లల్లో 5 సంస్థలు ఆస్తులతో సహా పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకొచ్చాయి. ఈ జాబితాలో విజయనగరం జిల్లాలోని శ్రీవెంకటేశ్వర కళాశాల, దేవా దాయ శాఖకు సంబంధించిన విద్యాలయాలు ఉన్నాయి. 11 కళాశాలల యాజమాన్యాలు ఇంతవరకు తమ అభిప్రాయాన్ని తెలపలేదు. సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు మాత్రం అంగీకరించాయి. ఎయిడెడ్ నిలిపి వేతపై ఆంధ్ర లయోలా కళాశాల న్యాయస్థానాన్ని ఆశ్ర యించింది. సిబ్బందిని అప్పగించేందుకు ఆసక్తి చూపని కళాశాలల విషయంలో వేచి చూడాలని ఉన్నత విద్యా శాఖ భావిస్తోంది. మొదట ఆస్తులతో సహా అప్పగిం చేవి. కేవలం సిబ్బందిని మాత్రమే ఇచ్చే వాటిపై నిర్ణయం తీసుకోవాలని తలపోస్తోంది. సిబ్బందిని వెన క్కిచ్చే 121 కళాశాలల జాబితా ప్రభుత్వానికి చేరింది.
0 Comments:
Post a Comment