గోధుమలంటే బ్రౌన్ కలర్లోనే ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ, నల్ల గోధుమలూ ఉంటాయి. మామూలు గోధుమల కంటే నల్ల గోధుమల ధర నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
అలాగే పోషక విలువలు కూడా నల్ల గోధుమల్లో అధికంగానే ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మరి లేటెందుకు నల్ల గోధుమలను తీసుకోవడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేమం వ్యాధి గ్రస్తులకు నల్ల గోధుమల ఓ అద్భుతమైన వరం అని చెప్పొచ్చు. అవును, వైట్ రైస్‌కు బదులుగా నల్ల గోధుమలతో తయారు చేసిన రొట్టెలను చేసుకుని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.
నల్ల గోధుమల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందు వల్ల, రక్త హీనతతో బాధ పడే వారు తమ డైట్లో గోధుమల్లో తీసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది.
అలాగే గుండె ఆరోగ్యానికి కూడా నల్ల గోధుమలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ తీసుకుంటే గుండె పోటు, ఇతర గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారికీ నల్ల గోధుమలు బెస్ట్ అప్షన్ అని చెప్పొచ్చు. నల్ల గోధుమల్లో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. అందు వల్ల, వీటితో చేసే రొట్టెలను తీసుకుంటే సూపర్ ఫాస్ట్‌గా బరువు తగ్గొచ్చు.
అంతేకాదు, నల్ల గోధుమలను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది. రక్త పోటు కంట్రోల్లో ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గు ముఖం పడతాయి. మరియు ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా తయారు అవుతాయి. సో.. ఇంకెందుకు ఆలస్యం బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ను అందించే నల్ల గోధుమలను ఇకపై మీరూ మీ డైట్లో చేర్చేసుకుంది.
0 Comments:
Post a Comment