AP High Court Jobs: డిగ్రీ పాస్ అయినవారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 174 ఉద్యోగాలు... రూ.49,870 వేతనం...
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు (Jobs in AP) శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీగా ఉద్యోగాల (AP High Court Jobs) భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులున్నాయి. మొత్తం 174 పోస్టులున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ (Direct Jobs) ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. డిగ్రీ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు (Online Application) చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. 2021 సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు చేయాలి. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
Andhra Pradesh High Court Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు 174
అసిస్టెంట్ 71
ఎగ్జామినర్ 29
టైపిస్ట్ 35
కాపీయిస్ట్ 39
Andhra Pradesh High Court Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 9
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 30
విద్యార్హతలు- అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్, సైన్స్, లా, కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. కాపీయిస్ట్ పోస్టుకు టైప్‌రైటింగ్ (ఇంగ్లీష్) హయ్యర్ గ్రేడ్‌లో ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామ్ పాస్ కావాలి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి.
వయస్సు- 18 నుంచి 42 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎగ్జామ్ ఫీజు- ఓపెన్ కేటగిరీ, బీసీ అభ్యర్థులకు రూ.800. ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్‌కి రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టీవ్ టైప్ ఎగ్జామినేషన్.
టైపిస్ట్, కాపీయిస్ట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అసిస్టెంట్, ఎగ్జామినర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Andhra Pradesh High Court Recruitment 2021: అప్లై చేయండి ఇలా
Step 1- అభ్యర్థులు ముందుగా https://hc.ap.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో రిక్రూట్మెంట్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
Step 3- Apply Here పైన క్లిక్ చేయాలి.
Step 4- బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5- అప్లై చేయాలనకునే పోస్టు, పేరు, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 6- యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
Step 7- ఇమెయిల్ ఐడీకి వచ్చిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
Step 8- లాగిన్ అయిన తర్వాత వ్యక్తిగత వివరాలు, క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేయాలి.
Step 9- ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
Step 10- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
Step 11- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
అభ్యర్థులు దరఖాస్తు చేయడంలో ఏవైనా సమస్యలు వస్తే క్యాండిడేట్ హెల్ప్ డెస్క్‌ని ఇమెయిల్ లేదా కాల్ ద్వారా సంప్రదించొచ్చు. hc.ap@aij.gov.in మెయిల్ ఐడీకి మెయిల్ చేయాలి. లేదా 0863-2372752 నెంబర్‌కు కాల్ చేయాలి.
0 Comments:
Post a Comment