విద్యుత్ బిల్లుల మోత
❇️అమరావతి
విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ ను విడుదల. చేసిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి
గృహ అవసరాలకు మూడు కేటగిరి లు గా వినియోగదారుల విభజన.
A.గ్రూప్
75 యూనిట్ ల కంటే తక్కువవినియోగదారులు. 0-50 యూనిట్ కి రూ.1.45
51-75 యూనిట్ లకు
రూ.2.60
B.గ్రూప్
75 నుంచి 225 యూనిట్ల వినియోగం
0-50 వరకు రూ.2.60
51-100 రూ.2.60
101-200 రూ.3.60
201-225 రూ.6.90
C. గ్రూప్
225 యూనిట్ల పైబడిన వినియోగదారులు
0-50 రూ.2.65
51-100 రూ.3.35
101-200 రూ.5.40
201-300 రూ.7.10
301-400 రూ.7.95
401-500 రూ.8.50
500 యూనిట్లకు మించి రూ.9.90
గృహ వినియోగ దారునికి ఇకపై కనీస చార్జీలు ఉండవు.
ఆ స్థానంలో ఒక కిలో వాట్ కి పది రూపాయలు ఛార్జ్
ఫంక్షన్ హాళ్లకు కూడా ఇకపై నిర్దిష్ట చార్జీలు ఉండవు.
500 యూనిట్ లకు మించి వినియోగించే వారికి స్మార్ట్ మీటర్లు ఆప్ట్ చేసుకునే అవకాశం.
విద్యుత్తు ఛార్జీల షాక్
వినియోగదారులపై ట్రూఅప్ ఛార్జీల భారం
జిల్లాలో 19.7లక్షల సర్వీసులపై బాదుడు
ఈనాడు, అమరావతి
ఆ గస్టులో విద్యుత్తు వినియోగానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్న బిల్లులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
విద్యుత్తు వినియోగానికి అదనంగా సర్దుబాటు ఛార్జీలు రూ.వందల్లో ఉండటంతో అదనపు భారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా కరోనాతో అన్ని రంగాలు కుదేలై ఆదాయం తగ్గిపోయిన తరుణంలో విద్యుత్తు ఛార్జీల భారం మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడంతో ఇప్పటికే ఇంటి బడ్జెట్ పెరిగిన నేపథ్యంలో సర్దుబాటు ఛార్జీలు అదనం కానున్నాయి. ఇది సెప్టెంబరు నెలతో మొదలై మార్చి నెల వరకు అంటే ఏప్రిల్ నెలలో ఇచ్చే బిల్లు వరకు కొనసాగుతుంది. గతంలో డిస్కంలకు నష్టాలు వచ్చాయంటూ ఇప్పుడు వినియోగదారుల నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. ఒకటో తేదీ నుంచి బిల్లులు తీస్తుండడంతో వాటిని చూసి వినియోగదారులు ఇంత భారమా? అని నిట్టూరుస్తున్నారు.
19.70 లక్షల సర్వీసులపై భారం
2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి విద్యుత్తు శాఖకు నష్టాలు వచ్చాయి. ఈ ఐదేళ్ల కాలంలో విద్యుత్తు సరఫరా వ్యయం, వాస్తవిక వ్యయానికి మధ్య వ్యత్యాసం రూ.3,669 కోట్లుగా విద్యుత్తు నియంత్రణ మండలి నిర్ధారించింది. ఈ మొత్తాన్ని వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఇది సెప్టెంబరు నెల నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ బిల్లు వరకు వసూలు చేస్తారు. అయితే ఏప్రిల్ 2019 తర్వాత కనెక్షన్లు తీసుకున్న వారికి పెంపు వర్తించదు. 2019 నుంచి ఇప్పటివరకు ట్రూఅప్ ఛార్జీలు లేకపోవడంతో వారికి ఉపశమనం కల్పించారు. జిల్లాలో మొత్తం 19.70 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లపైనే వేస్తున్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మినహాయించారు. ట్రూఅప్ ఛార్జీలను 2021- 22 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన అమ్మకాలపై లెక్కగట్టారు. వీటిని అన్ని విభాగాల వినియోగదారులకు ఒకేరీతిన నిర్ణయించి విధిస్తున్నారు. బిల్లులో వచ్చే మొత్తం కాక ఇది అదనం. ఆగస్టు నెల వినియోగానికి సంబంధించి సెప్టెంబరు నెలలో ఇస్తున్న బిల్లులో మనం వినియోగించిన ప్రతి యూనిట్‌కు రెగ్యులర్ బిల్లుతోపాటు యూనిట్‌కు రూ.1.23 అదనంగా వసూలు చేస్తారు. ప్రతి నెలలో ఆ నెలలో నిర్ణయించిన మేరకు యూనిట్‌పై అదనపు సొమ్ము లెక్కించి బిల్లు ఇస్తారు. ట్రూఅప్ ఛార్జీలు ఏనెలకు ఆనెల వేర్వేరుగా నిర్ణయించి మార్చి 2022 వరకు అమలు చేస్తారు. సగటున 200 యూనిట్లు వినియోగించే వినియోగదారులపై ప్రస్తుత నెలలో ట్రూఅప్ ఛార్జీల కింద రూ.246 అదనపు భారం పడుతోంది.
జిల్లా వ్యాప్తంగా ఆగస్టు నెలలో బిల్లింగ్ చేసిన యూనిట్లు 213.45 మిలియన్ యూనిట్లు. ఈ లెక్కన జిల్లాలో వినియోగదారులపై నెలకు సుమారు రూ.27కోట్ల వరకు అదనపు భారం పడనుంది.
* మాచర్ల పట్టణానికి చెందిన దుద్దుకూరి సైదారావు ఆగస్టు నెలలో 72 యూనిట్లు విద్యుత్తు వినియోగించారు. బిల్లు మొత్తం రూ.288 వచ్చింది. ఇందులో ట్రూఅప్ ఛార్జీలు రూ.88.56 వసూలు చేస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. అంటే వాడుకున్న 72 యూనిట్లకు ఒక్కొక్క యూనిట్‌కు రూ.1.23 చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రస్తుత బిల్లులో రూ.88.56 అదనపు భారం పడింది.
* పొన్నూరు పట్టణానికి చెందిన పీఆర్ మధుసూదనం ఆగస్టు నెలలో 181 యూనిట్లు విద్యుత్తు వాడుకున్నారు. ఇందుకు రూ.860 బిల్లు వచ్చింది. ఇందులో యూనిట్‌కు రూ.1.23 చొప్పున రూ.222.63లు ట్రూఅప్ ఛార్జీల కింద వసూలుచేస్తున్నారు. ఈమొత్తం వినియోగదారునిపై ఈనెలలో పడిన అదనపు భారం.
* గుంటూరు నగరంలో నివసిస్తున్న మాలేపాటి ఐశ్వర్యకు ప్రస్తుతం విద్యుత్తు బిల్లు రూ.1103 వచ్చింది. ఆగస్టు నెలలో 214 యూనిట్లు వాడుకున్నారు. ప్రస్తుతం వచ్చిన బిల్లులో ట్రూఅప్ ఛార్జీల కింద రూ.263.22 భారం పడింది.
* చేబ్రోలుకు చెందిన పసుపులేని మాధురికి ప్రస్తుతం రూ.2559 విద్యుత్తు బిల్లు వచ్చింది. ఆగస్టు నెలలో 357 యూనిట్లు వాడుకున్నారు. ఇందుకు గాను ట్రూఅప్ ఛార్జీల కింద రూ.439.11 అదనపు భారం పడింది.
0 Comments:
Post a Comment