న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎ్‌సఈ) ఈ సారి 9, 11వ తరగతుల పరీక్షలకు కూడా ప్రశ్నపత్రాలు రూపొందిస్తుందని సామాజిక మాధ్యమాల్లో వదంతులు వస్తున్నాయి.
దీనిపై సీబీఎ్‌సఈ స్పందించింది. 9, 11వ తరగతుల పరీక్షలకు తాము ప్రశ్నపత్రాలు రూపొందించడం లేదని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని చెప్పింది. పరీక్షలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటే ముందుగా తమ అధికారిక వెబ్సైట్లోనే పొందుపర్చుతామని వివరించింది.
0 Comments:
Post a Comment