55 శాతం ఫిట్మెంట్తో పిఆర్సి ఇవ్వాల్సిందే
సిపిఎస్ ను రద్దు చేయాలి
ఎంజీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండిశ్రీనివాసరావు
ఉద్యోగులు 37 నెలలుగా ఎదురు చూస్తోన్న 11వ పిఆర్ సిని 55 శాతం ఫిట్మెంట్ వెంటనే ప్రకటించాలని ఎపి ఎంజీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎఒ హోంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన మేరకు రెండు లక్షల ఉద్యోగుల ప్రయోజనాలు పరిరక్షిస్తూ సిపిఎసను రద్దు చేసి ఒపిఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్తో ముడిపెట్టకుండా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, రెండేళ్లు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులను పరీక్ష లేకుండా ఎపిపిఎస్సి నిబంధనల మేరకు బేషరతుగా క్రమబద్ధీకరించాలని కోరారు.బకాయి ఉన్న ఐదు డిఎలను పెరిగిన ధరలకనుగుణంగా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు కోరుతూ ఈ నెల ఒకటిన ఫ్యాప్టో ఆధ్వర్యాన నిర్వహించిన మహా నిరసనలు విజయవంతమయ్యాయని తెలిపారు. ఎఒ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి శివారెడ్డి మాట్లాడుతూ. ప్రజాప్రతినిధులకు జీవిత కాలం పెన్షన్ ఇస్తున్నారని, 30 నుంచి 35 సర్వీసు చేసిన ప్రభుత్వోద్యోగులకు ఎటువంటి ఆర్థిక భద్రతలేని సిపిఎస్ ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా జెఎసి చైర్మన్ సాయిరాం ఆధ్వర్యాన ఎంజీవో ఒలు సన్మానించారు.
0 Comments:
Post a Comment