థర్డ్‌వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలి : విద్యాశాఖ మంత్రి సురేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యాశాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ వ్యాక్సిన్ వేయించుకున్న ఉపాధ్యాయుల వివరాలు, ప్రస్తుతం కరోనా పాజిటివ్‌గా నమోదైన విద్యార్థుల, ఉపాధ్యాయుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 97.5 శాతం ఉపాధ్యాయులకు టీకా వేశారని, మిగిలిన 7,388 మందికి మాత్రమే వేయాల్సి ఉందన్నారు. 100 శాతం పూర్తి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగు కళాశాలల సిబ్బంది, విద్యార్థులకు కూడా వాక్సినేషన్ వేయించడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరు కాటంనేని భాస్కర్‌ను కోరారు. ఇప్పటికే అన్ని విద్యాసంస్థల్లో సిబ్బందికి వాక్సినేషన్ వేయించాలని ఆదేశాలు ఇచ్చామని కమిషనర్ భాస్కర్ చెప్పారు. 22 లక్షల వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వందమందికి వాక్సిన్ ఒకేసారి వేయడానికి విద్యాశాఖ ఏ కేంద్రాన్ని ప్రతిపాదిస్తే అక్కడ వాక్సిన్ వేసే ఏర్పాటు చేస్తామన్నారు. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లా వైద్యాధికారిని సంప్రదిస్తే చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, ఉన్నత విద్యామండలి కమిషనర్ పోలా భాస్కర్, ఇంటర్మీడియట్, పాఠశాల విద్య కమిషనర్లు రామకృష్ణ, వి.చినవీరభద్రుడు, ఎస్ఎస్ఎ డైరెక్టరు కె.వెట్రిసెల్వి, ఎస్‌ఇఆర్‌టి డైరెక్టరు బి.ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
0 Comments:
Post a Comment