WhatsApp Payments: వాట్సాప్ పేమెంట్‌లో నయా ఫీచర్... మీ పేమెంట్స్‌ని ఇలా సెట్ చేసుకోండి
ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్స్ హవా నడుస్తోంది. ప్రజలు క్యాష్ పేమెంట్ల కంటే డిజిటల్ పేమెంట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ కూడా గతంలో పేమెంట్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఫీచర్ ద్వారా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో చాట్ చేస్తూనే సులభంగా డబ్బు పంపించుకోవచ్చు. అయితే డబ్బు పంపడంతో పాటు తమ అనుభూతిని తెలియజేయడానికి ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను చేర్చింది వాట్సాప్. ఇకపై అవతలి వ్యక్తికి డబ్బులు పంపేటప్పుడు యూజర్లు 'పేమెంట్ బ్యాక్‌గ్రౌండ్'ను జోడించుకోవచ్చని తెలిపింది.
ఉదాహరణకు మీ సోదరికి రక్షాబంధన్ రోజు డబ్బులు పంపేటప్పుడు రక్షాబంధన్ బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌ను సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్నేహితుల పుట్టినరోజు నాడు డబ్బులు పంపేటప్పుడు కేకులు, కొవ్వొత్తులతో బ్యాక్‌గ్రౌండ్ ఎంచుకోవచ్చు. ప్రతి పేమెంట్ వెనుక ఉన్న థీమ్‌ను గుర్తు చేసేందుకు ఈ ఫీచర్ సహాయపడుతుందని వాట్సాప్ పేర్కొంది. భారత యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ గూగుల్ పే పేమెంట్స్ బ్రాగ్రౌండ్ ఫీచర్లా కనిపిస్తుంది.
ఇప్పటికే యూపీఐ పేమెంట్స్ సర్వీసుల విభాగంలో వాట్సాప్ తన ప్రత్యర్థి సంస్థలైన పేటీఎం, ఫోన్‌ఫే, గూగుల్ పే వంటి డిజిటల్ సంస్థలతో పోటీపడుతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) భాగస్వామ్యంలో వాట్సాప్ ఈ సరికొత్త పేమెంట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా భారతదేశంలోని 227 కంటే ఎక్కువ బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ పేమెంట్స్ డైరెక్టర్ మహీత్మే తెలిపారు. ఎక్కువ మంది యూజర్లకు డిజిటల్ పేమెంట్ సర్వీసులు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
వాట్సాప్ ఇటీవల మరో కొత్త ఫీచర్‌ను జోడించింది. ఐఓఎస్ యూజర్లు తమ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ ఫోన్లకు బదిలీ చేసే సౌకర్యాన్ని ప్రారంభించింది. ఐఓఎస్ బీటా వెర్షన్ వాడుతున యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని WaBetaInfo నివేదించింది. మీరు దీన్ని ప్రారంభించేందుకు.. సెట్టింగ్స్ సెక్షన్‌లోని చాట్స్ ఆప్షన్‌లోకి వెళ్లి 'మూవ్ చాట్స్ టు ఆండ్రాయిడ్'పై క్లిక్ చేయండి. ఆ వెంటనే మీ ఐఓఎస్ డివైజ్ నుంచి ఆండ్రాయిడ్ డివైజ్‌కు చాట్ హిస్టరీ ట్రాన్స్ఫర్ అవుతుంది.
0 Comments:
Post a Comment