Single pension for a rice card ..!
ఒక బియ్యం కార్డుకు ఒకే పింఛన్..!
కొత్త నిబంధన అమల్లోకి.. లబ్ధిదారులకు నోటీసులు..
డీఆర్డీఏ యంత్రాంగానికి వివరాలివ్వని వైనం
ప్రభుత్వం కొత్త ఉత్తర్వులతో లబ్ధిదారుల్లో ఆందోళన
అనంత పురం : ఒక బియ్యం కార్డుకు ఒకే పింఛన మంజూరు చేయాలన్న కొత్త నిబంధనను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.
ఇప్పటికే ఒకే రేషనకార్డులో రెండు పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల వివరాలు సేకరించారు. ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేశారు. జిల్లాలో గత వారం రోజులుగా నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. టీడీపీ హయాంలో ఒకే బియ్యం కార్డులో రెండు కేటగిరీలకు చెందిన పింఛన దారులకు మినహాయింపు ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి పింఛన్లల్లో కోతలు పెట్టడం మొదలు పెట్టారు. ఉదాహరణకు .. ఒక బియ్యం కార్డులో అత్తా, కోడలికి వితంతు, భార్య, భర్తల కు వృద్ధాప్య పింఛన వస్తుంటే వారిలో ఒకరి పింఛన తొలగిస్తారు. ఒకే కార్డులో ఇద్దరు వికలాంగులున్నా వారిద్దరికి పింఛన్లు కొనసాగిస్తారు. ప్రభుత్వ కొత్త నిబంధనల మేరకు ఒకే కార్డులో పింఛన్లు తీసుకున్న వారిలో అర్హులు ఎంత మంది...? అనర్హులు ఎంతమంది ఉన్నారన్న సమాచారాన్ని ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేక రించారు. కొందరి వివరాలు ఆనలైనలో నమోదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వస్తే మిగిలిన పింఛనదారుల వివరాలు నమోదు చేయనున్నారు. దీనిపై పింఛనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా బియ్యం కార్డుల్లో చేర్పులు,మార్పులు చేసుకునేందుకు పలు రకాల సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి. అన్ని అర్హతలున్నా ఒక బియ్యం కార్డు నుంచి పేర్లు తొలగించి, మరో బియ్యం కార్డు మంజూరు చేయడం సమస్యగా మారింది. దీంతో ఒకే బియ్యం కార్డులో ఇద్దరు పింఛన పొందుతున్న లబ్ధిదారులుంటే ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది.
3 వేల మందికిపైగా లబ్ధిదారులకు నోటీసులు..
జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 5.18 లక్షల మంది పింఛనదారులకు రూ.126.69 కోట్ల పింఛన సొమ్మును పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఒక బియ్యం కార్డులో రెండు పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు 3 వేల మందికి పైగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సెర్ప్ నుంచి నేరుగా గ్రామ, వార్డు సచివాలయాలకు సెర్ప్ ఉన్నతాధికారులు నోటీసులు పంపారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆయా లబ్దిదారులకు నోటీసులు జారీ చేశారు. ఇద్దరిలో ఎవరికి పింఛన ఇవ్వాలన్న సమాచారాన్ని సిబ్బంది సేకరిస్తున్నారు. అక్టోబరు నుంచి ఒకే బియ్యం కార్డులో ఒకే కేటగిరి పింఛన్లు పొందుతున్న ఇద్దరికి బదులుగా ఒక్కరికే పింఛన అందించనున్నట్లు స మాచారం. డీఆర్డీఏ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓల వద్ద ఒకే బియ్యం కార్డుల్లో ఇద్దరు పింఛన్లు పొందుతున్న వారి జాబితాను సెర్ప్ ఉన్నతాధికారులు పంపకపోవడం గమనార్హం. గతనెలలో బియ్యం కార్డులో భర్తల పేర్లు ఉండి పింఛన పొందుతున్న ఒంటరి మహిళలు, వితంతు లబ్ధిదారులు, డీఎంఅండ్హెచఓ పింఛనదారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 8 వేల దాకా పింఛన్లను తొలగించారు. వీరిందరికీ ఈ నెలలో పింఛన్లు ఇవ్వలేదు. తాజాగా ఒకే బియ్యం కార్డులో ఇద్దరు లబ్ధిదారులున్న వారికి నోటీసులు జారీ చేయడంపై ఆయా వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
గ్రామ,వార్డు సచివాలయాలకే వివరాలు పంపారు : నరసింహారెడ్డి, పీడీ, డీఆర్డీఏ
ఒకే బియ్యం కార్డులో ఇద్దరు సభ్యులు పింఛన్లు పొందుతున్న వారి వివరాలను సెర్ప్ ఉన్నతాధికారులు నేరుగా గ్రామ, వార్డు సచివాలయాలకు పంపారు. మాకు ఇప్పటి దాకా ఎలాంటి సమాచారం అందలేదు. ఒకే బియ్యం కార్డులో ఒకే కేటగిరీకి చెందిన పింఛనదారులు ఉండకూడదు. ఇందులో వికలాంగులకు మినహాయింపు ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఆయా లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనర్హులను తొలగిస్తాం.
0 Comments:
Post a Comment