Shock to Minsters: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. మంత్రులు అందరికీ ఉద్వాసన.. కొత్తగా ఎవరికి అవకాశం
ఓ వైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న సీఎం జగన్.. పాలనలోనూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనకంటూ సపరేట్ ట్రెండ్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ సీఎం తీసుకోని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇటీవల కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో అత్యధిక శాతం మంత్రులను మార్చి మోదీ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు సీఎం జగన్ మోదీని మించిన ఫార్ములాను అమలు చేస్తున్నారు. ఒకేసారి మంత్రులు అందరినీ తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలోని ఉన్నతస్థాయి వర్గాల్లో ప్రస్తుతం ఈ చర్చ జోరుగా సాగుతోంది. అదే జరిగితే... సీనియర్ నాయకుల భవిష్యత్తు ఏమిటి? ఏ కారణంతో తప్పిస్తారు..? వారికి ఎలాంటి హామీలు ఇస్తారు.. ఎలాంటి బాధ్యతలు అప్పచెబుతారు..? మరి కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నారు. ఈ విషయాలన్నీ ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే రెండున్నరేళ్ల తర్వాత పనితీరు ప్రాతిపదికన సగం మంది మంత్రులను తొలగిస్తాం. వారి స్థానంలో కొత్త వాళ్లను తీసుకుంటాం అని జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్లలోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఏకంగా 90 శాతం మంది మంత్రులకు ఉద్వాసన ఉంటుందని అంటున్నారు. మరోవైపు ఆయన చెప్పినట్టు రెండున్నరేళ్ల కాలం నవంబరు నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో... మంత్రులుగా ఎవరు ఉంటారు, ఎవరు మాజీలు అవుతారు అనేది తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది. సీఎం జగన్ తాజా ఆలోచన ప్రకారం మంత్రులు అందర్నీ తప్పించి.. వారికి పార్టీ పరంగా కీలక పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికలే టార్గెట్ గా ఆయన ఈ వ్యూహం అనుసరిస్తునట్టు తెలుస్తోంది. అలాగే పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకున్న వారిని మాత్రమే మంత్రి పదవుల్లోకి తీసుకొని కేడర్ కు భరోసా కల్పించాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు ఆయన తాజగా ఎమ్మెల్యేల పనితీరపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఆ నివేదిక ప్రకారం మంత్రి పదవుల కేటాయింపు ఉంటుంది అంటున్నారు.
మంత్రులందరికీ ఉద్వాసన పలికితే... సీనియర్ నేతలైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాయలసీమ జోన్ ఇన్చార్జిగా నియమించే అవకాశముంది. దక్షిణ కోస్తా జోన్ ఇన్చార్జిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా బొత్స సత్యనారాయణలను నియమిస్తారని తెలుస్తోంది. ఇక కృష్ణా, ఉభయ గోదావరితో కూడిన జోన్ ఇన్చార్జిగా కన్నబాబు లేదా కొడాలి నాని ఉండే అవకాశముందని కూడా తెలుస్తోంది.
వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం.. మొత్తం మంత్రులందరికీ టోకున ఉద్వాసన పలకాలని, వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 90 శాతం మందిని తీసేసి... ఇద్దరు ముగ్గురిని మాత్రమే కొనసాగించడం, 'వారు మాత్రమే ఎందుకు?' అనే చర్చకు తావివ్వడం... ఇదంతా ఎందుకు? మొత్తం అందరినీ తప్పించడమే మేలు అనే నిర్ణయానికి వచ్చినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిని మినహాయిస్తే... కేబినెట్లో 25 మంది మంత్రులు ఉన్నారు. రెండున్నరేళ్లు మంత్రి పదవులు అనుభవించారు. ఇకపై పార్టీ కోసం పని చేయండి అని ఆ పాతిక మందికి స్పష్టం చేసే అవకాశముంది.
ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం... 25 మందిని తప్పించి వారికి రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాలను అప్పగిస్తారని తెలుస్తోంది. వాటికి ఇన్చార్జిలుగా ప్రకటిస్తారు. ఆ లోక్సభ నియోకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీని బలోపేతం చేస్తూ... మళ్లీ పార్టీని గెలిపించుకురావాలని స్పష్టం చేయనున్నారు. ఈ బాధ్యతల్లో విజయవంతమైతే... 2024 ఎన్నికల తర్వాత మళ్లీ మంత్రులుగా తీసుకుంటామని చెబుతారు. అలాగే సీనియర్ మంత్రులకు అదనపు బాద్యతలు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలూ ఉన్నారు. అందరితోపాటు వారికీ ఉద్వాసన పలికితే... కొంత రాజకీయ అలజడి చెలరేగే అవకాశాలు ఉంటాయి. అలాంటి సీనియర్లలో అసంతృప్తి కలుగకుండా వారికి కొత్త అధికారాలతో కూడిన బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. రాష్ట్రాన్ని కొన్ని జోన్లుగా విభజించి.. ఆయా జోన్ల బాధ్యతను సీనియర్లకు అప్పగిస్తారనే ప్రచారం కూడా ఉంది.
ఏ జోన్కు ఎవరిని ఇన్చార్జిగా నియమించాలనే అంశంపైనా ఇప్పటికే స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. రాయలసీమ జిల్లాలకు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇన్చార్జిగా నియమించే అవకాశముంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కూడిన దక్షిణ కోస్తా జోన్కు సీఎం బంధువైన బాలినేని శ్రీనివాస రెడ్డిని ఇన్చార్జి చేయనున్నారు. ఉత్తరాంధ్రకు పెద్ద నేత బొత్స సత్యనారాయణ ఉండనే ఉన్నారు. ఇక... కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల జోన్ విషయంలోనే కొంత స్పష్టత లోపించింది. సామాజికవర్గ సమీకరణలను అనుసరించి కొడాలి నాని లేదా కన్నబాబును ఈ జోన్కు ఇన్చార్జిగా నియమించే అవకాశముందని తెలుస్తోంది. ఇదంతా దసరా కు అటు ఇటుగా కార్య రూపం దాలుస్తుంది అంటున్నారు.
0 Comments:
Post a Comment